అయిదుగురు పాక్‌ సైనికుల హతం!
close

తాజా వార్తలు

Published : 11/12/2020 22:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అయిదుగురు పాక్‌ సైనికుల హతం!

ఇంటర్నెట్ డెస్క్: జమ్మూ కశ్మీర్‌ ఫూంచ్‌ జిల్లాలో నియంత్రణ రేఖ వెంబడి జరిగిన ప్రతీకార దాడుల్లో ఐదుగురు పాక్‌ సైనికులను భారత బలగాలు మట్టుబెట్టాయి. ఈ ఘటనలో మరో ముగ్గురు పాక్‌ జవాన్లు గాయపడినట్లు రక్షణ శాఖ ప్రకటించింది. పాక్‌ బంకర్లను సైతం భారత బలగాలు ధ్వంసం చేసినట్లు పేర్కొంది. అంతకుముందు మాన్‌కోట్‌ సెక్టర్‌లో భారత పౌరులను లక్ష్యంగా చేసుకుని పాక్‌ బలగాలు కాల్పులు జరిపాయి. ప్రజల ఆస్తులకు తీవ్ర నష్టాన్ని కలిగించాయి. ఈ నేపథ్యంలో పాక్‌ దాడిని దీటుగా ఎదుర్కొన్న భారత బలగాలు ఎదురుకాల్పులు జరిపాయి. సుమారు రెండు గంటల పాటు కాల్పులు జరిగాయి. ఈ ఏడాది ఆరంభం నుంచి ఇప్పటి వరకు 3200 సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్థాన్‌ ఉల్లంఘించింది.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని