గురుగ్రామ్‌లో కూలిన పైవంతెన
close

తాజా వార్తలు

Updated : 23/08/2020 10:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

గురుగ్రామ్‌లో కూలిన పైవంతెన

గురుగ్రామ్‌ : హరియాణాలోని గురుగ్రామ్‌లో నిర్మాణంలో ఉన్న పైవంతెన కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు కార్మికులు గాయపడ్డారు. ఈ ఘటన శనివారం రాత్రి జరిగింది. పై వంతెన కూలడంతో రహదారిపై రాకపోకలు సాగిస్తున్న కొన్ని వాహనాలు 10 మీటర్ల దూరంలో పడ్డాయని పోలీసులు తెలిపారు. ప్లైఓవర్‌ నిర్మాణంలో లోపాల కారణంగా ప్రమాదం జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో రద్దీ లేకపోవడంతో ప్రాణనష్టం జరగలేదని భావిస్తున్నారు. 
సోహ్నా రోడ్డు ప్రాజెక్టులో నిర్మిస్తున్న ఎలివేటెడ్‌ కారిడార్‌ కూలిపోయిందని హరియాణా ఉపముఖ్యమంత్రి దుష్యంత్తు‌ చౌతాలా ట్విట్టర్‌లో తెలిపారు. ఈ ఘటనలో గాయపడిన ఇద్దరు కార్మికులు చికిత్స పొందుతున్నారని చెప్పారు. ఎన్‌హెచ్‌ఏఐ, ఎస్డీఎమ్‌, సహాయక బృందాలు ఘటనాస్థలిని పరిశీలిస్తున్నట్లు చెప్పారు. 
హరియాణాలో 21.66 కిలోమీటర్ల సోహ్నా రోడ్డు ప్రాజెక్టును రెండు ప్యాకేజీలలో చేపట్టారు. అయితే, మొదటి ప్యాకేజీలో భాగంలో అండర్‌పాస్‌, సుబాష్ చౌక్ నుంచి బాద్‌షాపూర్ వైపుకు 6 కిలోమీటర్ల పైవంతెనను నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టు 2021 జులై నాటికి పూర్తి కావల్సి ఉంది. Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని