ఝార్ఖండ్‌లో పోలియో అనుమానిత కేసు
close

తాజా వార్తలు

Published : 05/11/2020 01:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఝార్ఖండ్‌లో పోలియో అనుమానిత కేసు

2014లోనే పోలియో రహిత దేశంగా భారత్

రాంచీ : ఝార్ఖండ్‌కు చెందిన ఓ ఆరేళ్ల బాలుడు ఇటీవల అనారోగ్యం బారిన పడ్డారు. తీవ్ర జ్వరంతో బాధపడుతుండటంతో చిన్నారికి చికిత్స అందించిన వైద్యులు పోలియో లక్షణాలు ఉన్నట్లు అనుమానించారు. ఈ క్రమంలో వాళ్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) కార్యకర్తకు ఈ సమాచారాన్ని తెలియజేశారు. దీంతో సోమవారం డబ్ల్యూహెచ్‌ఓ కార్యకర్త వ్యాధి నిర్ధారణకు ఆ బాలుడి నుంచి శాంపిల్స్‌ సేకరించి కోల్‌కతాలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌(ఐఐఎస్‌)కు పంపారు. వ్యాధి నిర్ధారణ పరీక్షకు సంబంధించి 15 రోజుల్లో ఫలితం రానుంది. పరీక్షలో పోలియో  కాకపోతే చిన్నారి ఆరోగ్య పరిస్థితికి గల కారణాలను ఐఐఎస్‌ తెలుపుతుందని ఓ వైద్యుడు తెలిపారు. ఇదిలా ఉంటే 2014లోనే భారత్‌ పోలియో రహిత దేశంగా డబ్ల్యూహెచ్‌ఓ ప్రకటించింది.

గణాంకాల ప్రకారం మన దేశంలో 2018లో 13, 2019వ సంవత్సరంలో 32, ఈ ఏడాదిలో 19 పోలియో అనుమానిత కేసులు నమోదయ్యాయి. వీటిల్లో ఒకటి కూడా పోలియో పాజిటివ్‌గా నిర్ధరణ కాలేదు. 

 

    


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని