రోడ్డు ప్రమాదంలో ఏడుగురి మృతి
close

తాజా వార్తలు

Updated : 09/11/2020 15:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రోడ్డు ప్రమాదంలో ఏడుగురి మృతి

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సాత్నా జిల్లాలో ఓ ట్రక్కు, కారు ఢీకొన్న ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. పన్నా జిల్లాలో జరిగిన ఓ సంతాప సభకు హాజరై బొలేరో వాహనంలో తిరిగి వెళ్తుండగా రెవా పట్టణంలోని ఓ మలుపు వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా దూసుకొచ్చిన ఓ ట్రక్కు వారు ప్రయాణిస్తున్న బొలేరో వాహనాన్ని ఢీకొట్టింది. క్షతగాత్రులను రెవాలోని ఓ ఆసుపత్రికి తరలించారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని