కరోనా పంజా: 80% మరణాలు 5 రాష్ట్రాల్లోనే
close

తాజా వార్తలు

Updated : 25/06/2020 17:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనా పంజా: 80% మరణాలు 5 రాష్ట్రాల్లోనే

ముంబయి: భారత్‌లో కరోనా విజృంభిస్తోంది. రోజురోజుకీ రికార్డు స్థాయిలో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 4.73లక్షల కేసులు నమోదు కాగా.. 14,894మంది మృత్యువాతపడ్డారు. దేశంలో నమోదవుతున్న మరణాల్లో 80శాతం ఐదు రాష్ట్రాల్లోనే నమోదు కావడం గమనార్హం. వీటిలో మహారాష్ట్ర, దిల్లీ, గుజరాత్‌, తమిళనాడు, ఉత్తర్‌ ప్రదేశ్‌ ఉన్నాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 6739మంది మరణించగా.. దిల్లీలో 2365; గుజరాత్‌లో 1735; తమిళనాడులో 866, ఉత్తర్‌ప్రదేశ్‌లో 596 చొప్పున మరణాలు నమోదయ్యాయి.

పోలీసులను వణికిస్తోంది

కరోనా మహమ్మారి మహారాష్ట్ర పోలీస్ శాఖనూ వణికిస్తోంది. తాజాగా మరో 38మంది పోలీసులకు కరోనా సోకినట్టు ఆ రాష్ట్ర పోలీస్‌శాఖ వెల్లడించింది. తాజాగా మరో ముగ్గురు కొవిడ్‌ యోధులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా సోకిన పోలీసుల సంఖ్య 3239కి పెరిగింది. వీరిలో 991 మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. 54మంది ప్రాణాలు కోల్పోయారు. 

ఇదీ చదవండి..

భారత్‌లో కరోనా ఉగ్రరూపం.. ఒక్కరోజే 16922


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని