ఒక్క ఆసుపత్రిలో 80 మంది సిబ్బందికి కొవిడ్‌
close

తాజా వార్తలు

Published : 10/05/2021 00:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఒక్క ఆసుపత్రిలో 80 మంది సిబ్బందికి కొవిడ్‌

 సర్జన్‌ మృతి

ఇంటర్నెట్‌డెస్క్‌: దిల్లీలోని ఒకే ఆసుపత్రిలో నెల రోజుల వ్యవధిలో 80 మంది సిబ్బంది కొవిడ్‌ బారిన పడ్డారు. వీరిలో డాక్టర్‌ ఏకే రావత్‌ అనే సర్జన్‌ శనివారం మృతి చెందారు. ఆయన టీకా తీసుకొన్నా.. కొవిడ్‌ బారినపడి మృతిచెందడం గమనార్హం.  సరోజ్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఇది చోటు చేసుకొంది. 

‘‘ఏప్రిల్‌-మే మధ్యలో దాదాపు 80 మంది వైద్య సిబ్బంది కొవిడ్‌ బారిన పడ్డారు. వీరిలో నా జూనియర్‌ డాక్టర్‌ ఏకే రావత్‌ ప్రాణాలు కోల్పోయారు. ఆయనొక సర్జన్‌. అతనొక యోధుడు. నేను గతంలో కలిసినప్పుడు ‘అంతా బాగానే ఉంది. టీకా కూడా తీసుకొన్నాను’ అన్నారు.  అతను ధైర్యవంతుడు’’ అని ఆసుపత్రి చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ పి.కె.భరద్వాజ్‌ వెల్లడించారు. 

ఈ ఆసుపత్రి గత నెల ఆక్సిజన్‌ కొరతను తీర్చాలని దిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. దానిపై భరద్వాజ్‌ స్పందిస్తూ.. ‘‘పరిస్థితి ఇప్పుడు కొంచమే మెరుగుపడింది. కానీ, తర్వాతి స్టాక్‌ ఆక్సిజన్‌ ఎప్పుడు వస్తుందా అన్న ఆందోళన మాత్రం తగ్గడంలేదు’’ అని పేర్కొన్నారు. 

దిల్లీలో కరోనా వెలుగు చూసినప్పటి నుంచి ఇప్పటివరకు 18వేలకుపైగా కొవిడ్‌ బాధితులు ప్రాణాలు కోల్పోయారు. కేవలం గడిచిన రెండు వారాల్లోనే దాదాపు 6వేల మంది మృత్యువాతపడటం పరిస్థితికి అద్దం పడుతోంది. కొన్ని రోజులుగా నిత్యం అక్కడ దాదాపు 400లకు పైగా మరణాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ సమయంలో దిల్లీ ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ కొరత ఏర్పడింది. న్యాయస్థానాల జోక్యంతో చివరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆ సమస్యను అధిగమించే ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. 

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని