close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 15/07/2020 19:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కర్ణాటకలో ఇవాళ ఒక్కరోజే 87 మంది మృతి

బెంగళూరు: కర్ణాటకలో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. ఆ రాష్ట్రంలో ఇవాళ గరిష్ఠంగా 3,176 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన కేసుల్లో ఒక్క బెంగళూరు నగరం నుంచే 1975 కేసులు వెలుగుచూశాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కరోనాతో 87 మంది మృత్యువాత పడ్డారు. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 47,252కి చేరగా.. మరణాల సంఖ్య 929కి పెరిగింది.
కేరళలో కూడా కొవిడ్‌ విజృంభిస్తోంది. ఇవాళ ఆ రాష్ట్రంలో 623 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఒక్క తిరువనంతపురం నుంచే 157 కేసులు వచ్చాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 9,553 పెరిగిందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 4,880 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని చెప్పారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.