భారత్‌-చైనా ‘వేలు’ విడవని చర్చలు..!  
close

తాజా వార్తలు

Updated : 06/11/2020 16:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భారత్‌-చైనా ‘వేలు’ విడవని చర్చలు..!  

 8వ విడత కోర్‌కమాండర్‌ స్థాయి చర్చలు మొదలు

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత్‌-చైనా మధ్య లద్ధాక్‌లో ఉద్రిక్త పరిస్థితిని తగ్గించేందుకు నేడు 8వ విడత కోర్‌ కమాండ్‌ స్థాయి చర్చలు మొదలయ్యాయి. వీటిని చుషూల్‌-మాల్డో పోస్టులో ఉదయం 9.30 గంటలకు మొదలు పెట్టారు. ఇటీవలే ‘14వ కోర్‌’ కమాండర్‌ అధికారిక బాధ్యతలు చేపట్టిన చేపట్టిన లెఫ్టినెంట్‌ జనరల్‌ పీజీకే మేనన్‌ భారత్‌ తరపున ఈ చర్చల్లో పాల్గొన్నారు. ఆయన బాధ్యతలు స్వీకరించడానికి ముందు జరిగిన రెండు విడతల చర్చల్లో కూడా పాల్గొన్నారు. భారత్‌ ఇక్కడ ఉద్రిక్తతలు తగ్గించుకొని.. ఇరు వర్గాలు పూర్తి స్థాయిలో బలగాల ఉపసంహరణ డిమాండ్‌కు పూర్తిగా కట్టుబడి ఉంది. మే ముందు నాటి పరిస్థితులు నెలకొనాలని భారత్‌ కోరుతోంది. ఏకపక్షంగా చైనా చేసే డిమాండ్లకు తలొగ్గకూడదని నిర్ణయించుకొంది. ఇది ఇరుపక్షాలకు ప్రయోజనకరంగా ఉండాలని భారత్‌ భావిస్తోంది. 
ఆరో విడత చర్చల్లో మాత్రం ‘అదనపు బలగాల మోహరింపు’ను నిలిపివేయాలని నిర్ణయించాయి. ఆ తర్వాత ఎటువంటి పురోగతి లేదు. ఈ సారి చర్చల్లో పురోగతి సాధించవచ్చని భారత ఆర్మీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేశాయి.   

చైనా గొంతెమ్మ కోర్కెలు..

చైనా 7వ విడత చర్చల్లో గొంతెమ్మ కోర్కెలను బయటపెట్టింది. భారత్‌ ఫింగర్ నెంబర్‌ 3 వరకు పెట్రోలింగ్‌ చేయాలని కోరింది. చైనా ఫింగర్‌ నెంబర్‌ 5 వరకు పెట్రోలింగ్ చేస్తానని తెలిపింది. ఫింగర్‌ నెంబర్‌ 4ను నిస్సైనిక ప్రాంతంగా ఉంచాలని చెబుతోంది. ఇది చైనా ఎప్పుడూ అనుసరించే రెండు అడుగులు ముందుకు.. ఒక అడుగు వెనక్కి అన్న వ్యూహానికి అనుకూలంగా ఉంది. వాస్తవానికి ఫింగర్‌ 8 వరకు ఎల్‌ఏసీ ఉందని భారత్‌ చేస్తున్న వాదనకు ఇది విరుద్ధం. భారత్‌ దీనిని తిరస్కరించింది. దీనిపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ స్పందించారు. భారత్‌ భూమిని వదులుకొనే ప్రశ్నే లేదని తెలిపారు. అంతేకాదు.. భారత్‌ స్పంగూర్‌ సరస్సు వద్ద ఉన్న వ్యూహాత్మక శిఖరాలను ఖాళీ చేయాలన్న డ్రాగన్‌ డిమాండ్‌ను కూడా ఇప్పటికే తిరస్కరించింది.  Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని