నా భర్తని వెతికి పెట్టండి.. ప్లీజ్‌!
close

తాజా వార్తలు

Published : 03/07/2020 02:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నా భర్తని వెతికి పెట్టండి.. ప్లీజ్‌!

కొవిడ్‌ ఆస్పత్రిలో ఓ వృద్ధుడి అదృశ్యం
పోలీసులకు వృద్ధురాలి విజ్ఞప్తి

విజయవాడ: చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్లిన ఓ వృద్ధుడి అదృశ్య ఘటన విజయవాడలో కలకలం రేపుతోంది. వసంతరావు అనే వృద్ధుడి ఆరోగ్యం సరిగా లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆయన్ను ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. కరోనా లక్షణాలు ఉన్నాయని చెప్పడంతో గత నెల  24న కొవిడ్‌ ఆస్పత్రికి తరలించారు. సాయంత్రం వరకు అక్కడే ఉన్నప్పటికీ మరుసటి రోజు ఆధార్‌ కార్డు తేవాలని పంపారని ఆయన భార్య ధనలక్ష్మి తెలిపారు. తిరిగి ఉదయం వెళ్లే సరికి తన భర్త ఆస్పత్రిలో లేరనీ.. అడిగితే ఎక్కడున్నాడో తెలియదని ఆస్పత్రి సిబ్బంది చెప్పినట్టు బాధితురాలు ఆరోపిస్తున్నారు. సీసీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు వసంతరావును వీల్‌ చైర్‌లో ఆస్పత్రిలోకి తీసుకెళ్తున్నట్టు గమనించారు. అయితే, తన భర్త ఆచూకీ ఇంతవరకు ఆస్పత్రి వర్గాలు చెప్పడం లేదనీ.. వెంటనే వెతికించాలని ఆమె పోలీసులను కోరుతున్నారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని