విద్యార్థుల చెంతకే పాఠశాల!
close

తాజా వార్తలు

Published : 18/09/2020 02:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

విద్యార్థుల చెంతకే పాఠశాల!

ఛత్తీస్‌గఢ్‌: కరోనా లాక్‌డౌన్‌ కారణంగా మూసివేసిన పాఠశాలల పునః ప్రారంభంపై అనిశ్చితి ఏర్పడింది. ఆన్‌లైన్‌ తరగతులకు హాజరయ్యేందుకు చరవాణులు లేక కొందరు, కరోనాకు భయపడి మరికొందరు చదువుకు దూరమవుతున్నారు. విద్యార్థులు అవస్థలు చూసి చలించిపోయిన ఛత్తీస్‌గఢ్‌లోని ఓ ఉపాధ్యాయుడు ఎలాగైనా పాఠాలు చెప్పాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా వినూత్న పద్ధతిలో పాఠాలు బోధిస్తున్నారు.

ఛత్తీస్‌గఢ్‌లోని కొరియా జిల్లాకు చెందిన రుద్ర రాణా ఓ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రభుత్వం పాఠశాలలో ఆన్‌లైన్‌ పాఠాలు ఏర్పాటు చేయగా విద్యార్థులు చాలా తక్కువ సంఖ్యలో హాజరయ్యారు. ఇది గమనించిన రాణా విద్యార్థులు పాఠశాలకు రాకుంటే పాఠశాలనే విద్యార్థుల చెంతకు తీసుకెళ్లాలనుకున్నారు. తన బైకుపై ఓ గొడుగు, బోర్డు, ఇతర బోధన సామగ్రిని ఏర్పాటు చేసుకొని విద్యార్థుల వద్దకు వెళుతున్నారు. ఉపాధ్యాయుడిని చూసిన వెంటనే విద్యార్థులు పుస్తకాలతో సంచులతో ఇళ్ల నుంచి బయటికి వచ్చి భౌతికదూరం పాటిస్తూ కూర్చుని పాఠాలు వింటున్నారు. విద్యార్థులు చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశంతో వీధి వీధి తిరుగుతూ పాఠాలు బోధిస్తున్నట్లు రుద్ర రాణా చెబుతున్నారు. ఈ కొత్త పద్ధతికి విద్యార్థుల నుంచి మంచి స్పందన వస్తోందని రాణా వివరిస్తున్నారు. ఉపాధ్యాయుడు రుద్రరాణా కృషిని గ్రామస్థులు అభినందిస్తున్నారు. కొత్త పద్ధతిలో పాఠాల బోధన పట్ల విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని