ఏపీ మద్యం కోసం.. తెలంగాణ మందుబాబులు 
close

తాజా వార్తలు

Updated : 04/05/2020 14:32 IST

ఏపీ మద్యం కోసం.. తెలంగాణ మందుబాబులు 

ఎటపాక‌: కరోనా మహమ్మారి ప్రభావంతో దేశ వ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌ కారణంగా ఇన్నాళ్లూ మద్యం దుకాణాలు మూతపడిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా గ్రీన్‌, ఆరెంజ్‌ జోన్లలో మద్యం దుకాణాలు తెరిచేందుకు కేంద్రం అనుమతించడంతో ఇన్నాళ్లూ మందులేక అల్లాడిపోయిన మద్యం ప్రియలకు ఈ రోజు నుంచి అందుబాటులోకి వచ్చింది. దీంతో ఈ ఉదయం నుంచే మందుబాబులు మద్యం దుకాణాల వద్ద బారులు తీరారు. ఇదిగో చూడండి.. భద్రాచలం పట్టణానికి  కేవలం అర కి.మీ దూరంలో ఏపీ పరిధిలోని తూర్పుగోదావరి జిల్లాలోని ఎటపాకకు చెందిన ఓ మద్యం దుకాణం ఇది.  అక్కడ మద్యం కొనుగోలు చేసేందుకు తెలంగాణకు చెందిన మద్యం ప్రియులు  అక్కడికి చేరుకున్నారు. దాదాపు కి.మీకు పైగా మందుబాబులు ఇలా ఓపికగా నిలబడి బారులు తీరారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని