ఛత్తీస్‌గఢ్‌లో రెచ్చిపోయిన మావోయిస్టులు
close

తాజా వార్తలు

Published : 27/07/2020 18:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఛత్తీస్‌గఢ్‌లో రెచ్చిపోయిన మావోయిస్టులు

రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. నారాయణపూర్‌లోని దూల్‌ వద్ద ఉన్న ఛత్తీస్‌గఢ్‌ ఆర్మ్‌డ్‌ ఫోర్స్‌(సీఏఎఫ్‌) శిబిరంపై దాడికి తెగబడ్డారు. శిబిరం బయట కాపలాకాస్తున్న జవాన్లపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఓ జవాను అమరుడయ్యారు. ఇతర సిబ్బంది తేరుకునేలోపే మావోయిస్టులు దట్టమైన అడవిలోకి పారిపోయారు. ఇద్దరు సభ్యులున్న ఓ చిన్న యాక్షన్‌ టీం ఈ దాడికి పాల్పడి ఉంటుందని ఐజీ సుందరరాజ్‌ అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటన తర్వాత భద్రతాబలగాలు ఆ ప్రాంతంలో కూంబింగ్‌ చేపట్టాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని