ఆ మృతుడు టీకా వేయించుకోలేదు!
close

తాజా వార్తలు

Published : 22/10/2020 11:23 IST

ఆ మృతుడు టీకా వేయించుకోలేదు!

బ్రసీలియా: ఆస్ట్రాజెనికా అభివృద్ధి చేసిన టీకా ప్రయోగాల్లో భాగంగా ఓ వాలంటీరు మరణించినట్లు వార్తలు వచ్చిన తరుణంలో.. ఓ కీలక విషయం తెలిసింది. అసలు ఆ మృతుడు కొవిడ్ టీకాను వేయించుకోలేదని సన్నిహిత వర్గాల సమాచారం. ఆ టీకా కారణంగానే ఓ వ్యక్తి మృతి చెందినట్లు బుధవారం బ్రెజిల్ ఆరోగ్య విభాగం వెల్లడించిన సంగతి తెలిసిందే. కాగా, ట్రయల్స్‌లో పాల్గొన్న వ్యక్తి మరణించిన విషయం తమకు సోమవారం తెలిసిందని, ట్రయల్స్‌ భద్రతను అంచనా వేసే అంతర్జాతీయ కమిటీ నుంచి పాక్షిక నివేదిక అందిందని బ్రెజిల్ వైద్యాధికారి వెల్లడించారు. అలాగే వాటిని కొనసాగించాలని ఆ కమిటీకి సూచించినట్లు వెల్లడించారు.

ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంతో కలిసి ఆస్ట్రాజెనికా ఈ టీకాను అభివృద్ధి చేసింది. ఇది పలు దేశాల్లో ప్రయోగ దశలో ఉంది. అయితే కొద్ది రోజుల క్రితం బ్రిటన్‌లో ఒక వాలంటీరు  స్వల్ప అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఈ వ్యాక్సిన్‌ మూడో దశ ప్రయోగాలు తాత్కాలికంగా నిలిపివేశారు. ఆ తరవాత యూకే, బ్రెజిల్, దక్షిణాఫ్రికా, భారత్‌లో ఆ ట్రయల్స్‌ను తిరిగి ప్రారంభించారు. కానీ, అమెరికాలో మాత్రం ఆ ప్రయోగాలను నెల రోజులకు పైగా నిలిపివేశారు. కాగా, ఇటీవల ఒక వాలంటీరుకు అనారోగ్య సమస్య తలెత్తడంతో జాన్సన్‌ అండ్ జాన్సన్ సంస్థ టీకా ప్రయోగాలకు కూడా తాత్కాలికంగా బ్రేక్ పడింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని