Ts news: అరగంటలో టన్ను చేపలు మాయం
close

తాజా వార్తలు

Updated : 24/06/2021 12:11 IST

Ts news: అరగంటలో టన్ను చేపలు మాయం

జాతీయ రహదారిపై వాహనం బోల్తా

చౌటుప్పల్‌గ్రామీణం, న్యూస్‌టుడే: హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం అంకిరెడ్డిగూడెం స్టేజీ సమీపంలో కర్ణాటక రాష్ట్రం బీదర్‌కు చేపల లోడుతో వెళ్తున్న వాహనం టైరు పంక్చర్‌ అవడంతో బుధవారం ఉదయం బోల్తా పడింది. ఆ వాహనాన్ని వెనుకాల వచ్చిన ఓ కారు ఢీకొట్టింది. ఎవరికీ గాయాలు కాలేదు. వాహనంలో సుమారు టన్ను చేపలుండగా.. ఎగిరి బయటపడ్డాయి. వాటిని పట్టుకోవడానికి స్థానికులు, ప్రయాణికులు పోటీ పడ్డారు. అర గంటలోనే సుమారు టన్ను సరకు ఖాళీ అవడం గమనార్హం. ప్రమాదంతో జాతీయ రహదారిపై కొద్దిసేపు వాహనాల రాకపోకలు స్తంభించాయి. పోలీసులు చేరుకొని పునరుద్ధరించారు. వాహనంలో తరలిస్తున్నవి నిషేధిత క్యాట్‌ ఫిష్‌ అని తెలిసింది.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని