close

తాజా వార్తలు

Published : 02/08/2020 09:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కరోనాను జయించిన 110 ఏళ్ల బామ్మ

చిత్రదుర్గ: ప్రపంచమంతా కరోనాతో వణికిపోతున్న వేళ.. మహమ్మారి నుంచి కోలుకొని ఇళ్లకు చేరుతున్నవారి ఉదంతాలు కొంత ఉపశమనం కలిగిస్తున్నాయి. వృద్ధులు సైతం మహమ్మారిని జయించి ఇంటికి చేరుతున్న ఘటనలు ఊరటగా నిలుస్తున్నాయి. కొన్ని జాగ్రత్తలు, అప్రమత్తతతో పాటు మనోధైర్యంతో ఉంటే వైరస్‌ మెడలు వంచడం పెద్ద సమస్యేమీ కాదన్న విశ్వాసాన్ని నింపుతున్నాయి. తాజాగా కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాకు చెందిన 110 ఏళ్ల సైదమ్మ అనే బామ్మ కొవిడ్‌-19 నుంచి కోలుకున్నారు. శనివారం ఆమె ఆస్పత్రి నుంచి ఇంటికి చేరుకున్నారు. చికిత్స అందజేసిన వైద్యులు హర్షధ్వానాల మధ్య ఆమెను ఇంటికి పంపారు. 

కరోనా సోకితే బతకడం కష్టమన్న అపోహలు నెలకొన్న వేళ సైదమ్మ ఉదంతం అవన్నీ తప్పని నిరూపిస్తోంది. కొవిడ్‌-19 సోకి నిరాశలో కూరుకుపోతున్న వారిలో విశ్వాసం నూరిపోస్తోంది. రోగనిరోధకతను పెంచే ఆహారంతో పాటు వైద్యుల సూచనలు పాటిస్తే కోలుకోవడం ఖాయమని చెబుతోంది. 

శనివారం నాటికి దేశంలో రివకరీ రేటు 64.53 శాతంగా ఉంది. ఇప్పటి వరకు కరోనా సోకిన వారిలో 10,94,374 మంది కోలుకొని ఇంటికి చేరుకున్నారు. శుక్రవారం ఒక్కరోజే 36,569 మంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ఇక ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 1,80,11,866 మందికి వైరస్‌ బారిన పడగా.. వీరిలో 1,13,26,234 మంది కోలుకొని ఇంటికి చేరుకున్నారు. 


 


 

Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని