2022లో యూపీ అసెంబ్లీ ఎన్నికల బరిలో ఆప్‌
close

తాజా వార్తలు

Published : 16/12/2020 02:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

2022లో యూపీ అసెంబ్లీ ఎన్నికల బరిలో ఆప్‌

ప్రకటించిన అరవింద్ కేజ్రీవాల్

దిల్లీ: 2022లో ఉత్తర్‌ప్రదేశ్‌(యూపీ)లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తాము పోటీ చేయనున్నామని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్‌) మంగళవారం ప్రకటించింది. ప్రస్తుతం అధికారంలో ఉన్న యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం ప్రజలకు విద్య, వైద్యం వంటి కనీస సదుపాయాలు కల్పించలేకపోతుందని పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు. అక్కడి పార్టీలన్నీ ప్రజలను మోసం చేశాయని, నిజాయతీ గల ప్రభుత్వం కోసం వారు ఎదురుచూస్తున్నారన్నారు. 

‘విద్య, వైద్యం, కనీస సదుపాయాల కోసం ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రజలు ఎందుకు దిల్లీకి వస్తున్నారు? అవి వారి రాష్ట్రంలోనే ఎందుకు లభించడం లేదు? 2022లో జరిగే ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ పోటీ చేస్తుంది. దిల్లీలో లభించే సంక్షేమ పథకాలు ఉత్తర్‌ప్రదేశ్‌లో కూడా లభించాలని దేశరాజధానిలో నివసించే ఆ రాష్ట్ర ప్రజలు కొన్నేళ్లుగా నాకు చెప్తున్నారు. సంగం విహార్‌(దిల్లీ)లో మొహల్లా క్లినిక్‌లు ఉన్నప్పుడు..గోమతి నగర్‌(యూపీ)లో కూడా వాటిని ఏర్పాటు చేయొచ్చు’ అని కేజ్రీవాల్ తన ప్రకటనలో భాగంగా ఆ రాష్ట్రంలోని సౌకర్యాల లేమిని ఎత్తిచూపారు. 

యూపీలోని ప్రతి పార్టీ ప్రజలను దారుణంగా మోసగించిందని విమర్శించారు. అవినీతిలో ప్రతి ప్రభుత్వం మరో ప్రభుత్వాన్ని దాటేసిందని ఎండగట్టారు. ‘యూపీ రాజకీయాల్లో మంచి ఉద్దేశం లేదు. ఆప్ దాన్ని తీసుకురాగలదు. ఈ రాష్ట్ర ప్రజలు ఇక ఇతర పార్టీలను మర్చిపోతారని నేను హామీ ఇవ్వగలను. దిల్లీ ప్రజలు నిజాయతీ గల ప్రభుత్వం కోసం ఎదురుచూడటం వల్ల ఆప్‌కు ఓటేశారు. ఇప్పుడు యూపీ వాసులకు కావాల్సింది కూడా అదే’ అని వ్యాఖ్యానించారు. 

ఇవీ చదవండి:

మీ కుమారుడి కోసం అమ్మకానికి ఉద్యమం

మా ప్రభుత్వంలో రైతులకు అన్యాయం జరగదు


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని