భారత్‌లో కొవిడ్‌ కట్టడికి ఏడీబీ చేయూత!
close

తాజా వార్తలు

Published : 29/07/2020 15:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భారత్‌లో కొవిడ్‌ కట్టడికి ఏడీబీ చేయూత!

మనీలా: భారత్‌లో కరోనా కట్టడి చర్యలకు ఏషియన్ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌(ఏడీబీ) చేయూతనిస్తోంది. మూడు మిలియన్‌ డాలర్ల గ్రాంటు మంజూరుకు మంగళవారం ఆమోదం తెలిపింది. ఆసియా పసిఫిక్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫండ్‌(ఏపీడీఆర్‌ఎఫ్‌) కింద భారత్‌కు ఈ నిధులను సమకూర్చనుంది. వైరస్‌ బాధితుల్ని వేగంగా గుర్తించడంతో పాటు వారికి చికిత్స అందజేయడం వంటి చర్యలకు ఈ నిధుల్ని ఉపయోగించాలని నిర్దేశించింది. అలాగే, పరీక్షల రేటు పెంచడం, లక్షణాలున్న వారిని వీలైనంత వేగంగా గుర్తించడం వంటి పనులకు ఈ నిధుల్ని వెచ్చించాలని సూచించింది. గత ఏప్రిల్‌లోనూ కొవిడ్‌ కట్టడి నిమిత్తం 1.5 బిలియన్‌ డాలర్లును విడుదల చేసింది. ఏడీబీ సభ్య దేశాల్లో కరోనా వైరస్‌ నివారణ, కట్టడి కోసం ఏప్రిల్‌ 13న 20 బిలియన్‌ డాలర్లతో ‘కొవిడ్‌-19 పాండెమిక్‌ రెస్పాన్స్‌ ఆప్షన్‌’(సీపీఆర్‌వో) పేరిట ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసింది.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని