close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్ @ 1 PM

1. టెహ్రాన్‌లో కూలిన విమానం

ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. 176 మంది ప్రయాణికులు, సిబ్బందితో కీవ్‌ వెళ్తున్న ఉక్రెయిన్‌ అంతర్జాతీయ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్‌ 737 విమానం కుప్పకూలింది. టెహ్రాన్‌లోని ఇమామ్‌ ఖొమైనీ ఎయిర్‌పోర్టు నుంచి టేకాఫ్‌ అయిన కాసేపటికే ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం కారణంగా విమానంలో ఉన్న 176 మంది సజీవదహనమైనట్లు ఇరాన్‌ మీడియా వెల్లడించింది. మృతుల్లో 167 మంది ప్రయాణికులు కాగా.. 9 మంది సిబ్బంది ఉన్నారు. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. రైతులపై అక్రమ కేసులు: లోకేశ్‌

మీడియాపై దాడికేసులో అరెస్టయి.. గుంటూరు జిల్లా కారాగారంలో ఉన్న అమరావతి రైతులను తెదేపా జాతీయ అధ్యక్షుడు నారా లోకేశ్‌, జేఏసీ నేతలు పరామర్శించారు. గత ఐదేళ్లలో ఎప్పుడైనా రాజధాని రైతులు ఆందోళనలు చేశారా? ఈ పరిస్థితి ఇప్పుడే ఎందుకొచ్చిందని లోకేశ్‌ ప్రశ్నించారు. రాజధానిని మూడు ముక్కలు చేస్తే .. రాష్ట్రం ఎప్పటికీ అభివృద్ధి చెందదన్నారు. మూడు ప్రాంతాల్లో రాజధాని ఉంటే అధికారులు, ప్రజాప్రతినిధులు కార్యాలయాల చుట్టూ తిరగడానికే సరిపోతుందన్నారు. రాజధాని రైతులకు జేఏసీ తరఫున న్యాయ సహాయం అందిస్తామని లోకేశ్‌ తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. పిన్నెల్లిపై దాడి ప్రైవేటు వ్యక్తుల పనే: రైతులు

రాజధాని రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. వెలగపూడి దీక్షలో పలువురు రైతులు మాట్లాడుతూ.. వైకాపా నేతలపై తీవ్ర ఆరోపణలు చేశారు. నిన్న చినకాకాని వద్ద మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లిపై దాడి ముమ్మాటికీ ప్రైవేటు వ్యక్తుల పనేనని ఆరోపించారు. వైకాపా నేతలే దాడి చేయించి రైతులపై ఆ నెపం మోపుతున్నారని మండిపడ్డారు. పోలీసులు వద్దని వారించినా పిన్నెల్లి ...నిరసన జరిగే ప్రదేశానికి ఎందుకొచ్చారని ప్రశ్నించారు. ప్రైవేటు వ్యక్తులే దాడికి పాల్పడ్డారంటూ కొన్ని ఫొటోలు విడుదల చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఇరాక్‌లోని భారత పౌరులారా.. జాగ్రత్త..!

అమెరికా-ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. మిలిటరీ కమాండర్‌ సులేమానీ హత్యకు ప్రతీకారంగా ఇరాక్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్‌ క్షిపణి దాడులు చేసింది. దీంతో మధ్యప్రాచ్యంలో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం ట్రావెల్‌ అడ్వైజరీ జారీ చేసింది. ఇరాక్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా ప్రస్తుతం భారత పౌరులు ఆ దేశానికి వెళ్లకుండా ఉంటే మంచిదని హెచ్చరించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. భారత్‌ బంద్‌: నిరసనలో పాల్గొన్న కార్మికులు

కార్మిక సంస్కరణలు, ఎఫ్‌డీఐలు సహా కేంద్ర ప్రభుత్వం పలు ప్రజా వ్యతిరేక విధానాలను అవంబిస్తోందని ఆరోపిస్తూ కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా బుధవారం బంద్‌కు దిగాయి. ఈ బంద్‌కు కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ మద్దతు తెలుపుతూ ట్వీట్‌ చేశారు. ‘మోదీ- షా ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల వల్ల నిరుద్యోగ సమస్య ఏర్పడుతోంది. మోదీ తన స్నేహితుల కోసం తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా పీఎస్‌యూలు సంక్షోభానికి గురవుతున్నాయి. నేడు 25కోట్ల మంది భారత్‌ బంద్‌లో పాల్గొంటున్నారు. వారికి నేను సెల్యూట్‌ చేస్తున్నా’ అంటూ రాహుల్‌ ట్వీట్‌ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. అమరావతి : 22వ రోజుకు చేరిన రైతుల ఆందోళనలు

7. అందుకే నాలుగో స్థానంలో వచ్చా: కోహ్లీ

శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో భారత్‌ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే ఎప్పటిలా కోహ్లీ మూడో స్థానంలో రాకుండా నాలుగోస్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. మ్యాచ్‌ అనంతరం కోహ్లీ మాట్లాడుతూ.. ‘‘జట్టుకు అవసరమైన సమయంలో ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలని శ్రేయస్‌ మూడో స్థానంలోకి పంపించా. ఒత్తిడిలో మ్యాచ్‌ను ముగించడానికి యువ ఆటగాళ్లు అలవాటుపడాలి. అందుకే వారికి అవకాశాలు ఇవ్వాలనుకున్నా. నేను మూడు, నాలుగు స్థానాల్లో బ్యాటింగ్‌ చేయగలను’’ అని కోహ్లీ అన్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. రెండు రోజుల్లో రిలీజ్‌.. కంగన స్పందన

యాసిడ్‌ దాడి బాధితురాలు లక్ష్మి అగర్వాల్‌ జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కిన చిత్రం ‘చపాక్‌’. మేఘనా గుల్జర్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో దీపికా పదుకొణె కీలకపాత్ర పోషించారు. మరో రెండు రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో బాలీవుడ్‌ క్వీన్‌ కంగనా రనౌత్‌ ‘చపాక్‌’ చిత్రంపై స్పందించారు. ఈ మేరకు ఆమె ఓ స్పెషల్‌ వీడియోను చిత్రీకరించి సోషల్‌మీడియా వేదికగా పోస్ట్‌ చేశారు. భారతదేశం యాసిడ్‌ దాడులు లేని దేశంగా మారాలన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. వార్‌ ఎఫెక్ట్‌: పతనమవుతున్న మార్కెట్లు

అమెరికా-ఇరాన్‌ మధ్య కమ్ముకున్న యుద్ధ మేఘాలు భారత్‌ మార్కెట్లను బెంబెలెత్తిస్తున్నాయి. ఇరు దేశాల మధ్య నెలకొన్న పరిస్థితుల కారణంగా మదుపర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. నిన్నటి సెషన్‌లో పుంజుకున్న సూచీలు బుధవారం ఉదయం నుంచి నష్టాల్లోనే పయనిస్తున్నాయి. ఉదయం 9.55 నిమిషాలకు సెన్సెక్స్‌ 130 పాయింట్లకు పైగా నష్టపోగా 11.30 గంటల సమయంలో 300 పాయింట్ల మేర పడిపోయింది. అటు నిఫ్టీ 95 పాయింట్ల నష్టంతో 12వేల మార్క్‌ దిగువకు వచ్చింది. ప్రస్తుతం ఒంటిగంట సమయానికి సెన్సెక్స్‌ 145 పాయింట్లు నష్టపోయి.. 40,724 వద్ద, నిఫ్టీ 50 పాయింట్లు కోల్పోయి 12,002 వద్ద కొనసాగుతోంది.

10. గుజరాత్‌లో అట్టహాసంగా పతంగుల పండుగ

 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.