close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్ @ 1 PM

1. సేవ్‌ అమరావతి నినాదం కావాలి: చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్‌ 24వ వర్ధంతి సందర్భంగా మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విగ్రహానికి తెదేపా అధినేత చంద్రబాబు నివాళులర్పించారు. తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు, నారా లోకేశ్‌, కనకమేడల రవీంద్ర, టీడీ జనార్దన్‌, వర్ల రామయ్య, కాలువ శ్రీనివాసులుతో పాటు పలువురు తెదేపా నేతలు నివాళులర్పించిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా  చంద్రబాబు మాట్లాడుతూ... అమరావతిని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేయాలి. సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌, సేవ్‌ అమరావతి  ప్రతి ఒక్కరి నినాదం కావాలి’’ అని అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. తెలంగాణలో థాయ్‌లాండ్ పెట్టుబడులు

మాదాపూర్‌లో ఇండియా-థాయ్‌లాండ్‌ మ్యాచింగ్‌ అండ్‌ నెట్‌వర్కింగ్‌ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌, థాయ్ లాండ్‌ ఉప ప్రధాని జరీన్ లక్సనావిసిత్‌ తదితరులు పాల్గొన్నారు. రబ్బర్‌ వుడ్‌ పరిశ్రమలో థాయ్‌ లాండ్‌ భారీ పెట్టుబడులు పెట్టనుంది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ...థాయ్‌కు భారత్‌కు చాలా దగ్గర  సంబంధాలు ఉన్నాయన్నారు. తెలంగాణ రాష్ట్రం దేశ వృద్ధిరేటును మించి అభివృద్ధి చెందుతోందన్నారు. తెలంగాణలో వాణిజ్య రంగంలో చాలా అవకాశాలు ఉన్నాయని, ఫర్నిచర్‌ పార్క్‌ ఏర్పాటు చేయాలని థాయ్‌ ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ‘ప్రాణాలైనా అర్పిస్తాం.. రాజధానిని సాధిస్తాం’

రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ ఆ ప్రాంత రైతులు చేపట్టిన ఆందోళనలు 32వ రోజు కొనసాగుతున్నాయి. ‘ప్రాణాలైనా అర్పిస్తాం.. రాజధానిని సాధిస్తాం’ అంటూ 29 గ్రామాల రైతులు ఉద్యమిస్తున్నారు. మందడం, తుళ్లూరులో నిర్వహించిన మహాధర్నాలో మహిళలు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొని నిరసన తెలిపారు. ప్రభుత్వం నిర్ణయంతో 29 గ్రామాల రైతులు, మహిళలు రోడ్లపైకి రావాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సీఎం జగన్‌ స్పందించి మూడు రాజధానుల ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. శిరిడీ ఆలయం నిరవధిక మూసివేత!

‘సాయిబాబా జన్మభూమి’పై నెలకొన్న వివాదం నేపథ్యంలో జనవరి 19వ తేదీ ఆదివారం నుంచి శిరిడీలోని సాయిబాబా ఆలయాన్ని నిరవధికంగా మూసి వేయనున్నట్లు ‘సాయిబాబా సంస్థాన్‌ ట్రస్ట్‌’ ప్రకటించింది. ఈ మేరకు ట్రస్ట్‌ సభ్యుడొకరు శుక్రవారం ప్రకటన చేసినట్లు పలు జాతీయ మీడియా సంస్థలు పేర్కొన్నాయి. తదుపరి కార్యాచరణపై చర్చించడానికి శనివారం సాయంత్రం శిరిడీ గ్రామస్థులంతా సమావేశం కానున్నట్లు స్పష్టం చేశారు. అయితే ఆలయ సందర్శనకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ముంబయిలో ఇకపై 24X7 పబ్బులు..!

ప్రపంచ ప్రఖ్యాతి నగరాల్లో ఒకటైన దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో ఇకపై దుకాణ సముదాయాలు, రెస్టారెంట్లు, మల్లీప్లెక్స్‌లు 24గంటలు తెరవనున్నారు. ఈ మేరకు శుక్రవారం జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు మహారాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి ఆదిత్య ఠాక్రే వెల్లడించారు. అయితే ప్రస్తుతానికి ఇది ప్రయోగాత్మకంగానే అమలు చేయనున్నామని తెలిపారు. జనవరి 26 నుంచి ముంబయిలోని ఫోర్ట్‌ అండ్‌ కాలా ఘోడా, బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌ ప్రాంతాల్లో అనుమతించిన దుకాణ సముదాయాలు, రెస్టారెంట్లు, మల్టీప్లెక్స్‌లు, పబ్బులు 24X7 తెరుచుకోనున్నట్లు అధికారులు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. జీఎస్‌టీ వసూళ్ల లక్ష్యం పెంపు

రాబోయే రెండు నెలలకు జీఎస్‌టీ వసూళ్ల లక్ష్యాన్ని పెంచుతూ పన్ను అధికారులు నిర్ణయం తీసుకున్నారు. జనవరి, ఫిబ్రవరిలో రూ. 1.15లక్షల కోట్లు, మార్చి నెలలో రూ. 1.25లక్షల కోట్లు వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ మేరకు రెవెన్యూ కార్యదర్శి అజయ్‌ భూషణ్‌ పాండే నేతృత్వంలో శుక్రవారం జరిగిన ఉన్నత స్థాయిలో సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. అంతకుముందు నెలకు రూ. 1.1లక్షల కోట్ల జీఎస్‌టీ వసూళ్లను లక్ష్యంగా పెట్టుకున్న అధికారులు.. తాజాగా దాన్ని రూ. 1.15లక్షల కోట్లకు పెంచారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ‘రాహుల్‌ని ఎన్నుకొని ఘోరం చేశారు’

ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహ కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్‌ని ఎన్నుకొని కేరళ ప్రజలు ఘోరమైన పని చేశారని వ్యాఖ్యానించారు. కేరళలో ‘లిటరేచర్‌ ఫెస్టివల్‌’లో ‘దేశభక్తి వర్సెస్‌ యుద్ధోన్మాదం’ అనే అంశంపై  ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘కష్టపడి పనిచేసే, స్వయంగా ఎదిగిన ప్రధాని నరేంద్ర మోదీపై ఐదోతరానికి చెందిన రాహుల్‌’ గెలిచే అవకాశం లేదు. స్వాతంత్ర్య పోరులో గొప్ప పార్టీగా వెలుగొందిన కాంగ్రెస్‌ దయనీయమైన కుటుంబ సంస్థగా మారడమే.. దేశంలో హిందుత్వ, యుద్ధోన్మాద ప్రాబల్యం పెరిగడానికి కారణం’ అని చెప్పుకొచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ధోనీ గురించి దాదాని అడిగితే ఏమన్నాడంటే..

టీమిండియా మాజీ సారథి ఎంఎస్‌ ధోనీ భవితవ్యంపై నెలకొన్న సందిగ్ధత గురించి మాట్లాడటానికి బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ నిరాకరించాడు. 2019 అక్టోబరు నుంచి 2020 సెప్టెంబర్‌ కాలానికి కాంట్రాక్ట్‌ ఆటగాళ్ల జాబితాను బీసీసీఐ గురువారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ జాబితాలో ధోనీ చోటు కోల్పోయాడు. దీంతో ధోని రిటైర్మెంట్‌ కథ క్లైమాక్సుకు చేరుకున్నట్లేనానని ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. అయితే దీనిపై స్పందించాలని దాదాని కోరగా అతడు నిరాకరించాడు. ‘‘దీనిపై నేను స్పందించను’’ అని తెలిపాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. పెట్రోల్‌ బంకులో విద్యుదాఘాతం: ముగ్గురి మృతి

గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండల పరిధిలోని రామచంద్రపురం వద్ద జాతీయ రహదారి పక్కనున్న పెట్రోల్‌ బంకులో ఘోర ప్రమాదం జరిగింది. ఇనుప స్టాండ్‌ సాయంతో పెట్రోల్‌ బంకులో విద్యుత్‌ బల్బు మారుస్తున్న క్రమంలో ప్రమాదం జరిగింది. విద్యుత్‌ వైరు ఇనుప స్టాండ్‌కు తగిలి విద్యుదాఘాతానికి గురై ముగ్గురు మృతి చెందారు. డేరంగుల శ్రీనివాసరావు(45), షేక్‌ మౌలాలి(22) అక్కడికక్కడే మృతి చెందగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ  శేఖర్‌ (48) ప్రాణాలు కోల్పోయాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద కుటుంబ సభ్యుల నివాళులు


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.