close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్ @ 1 PM

1. నల్ల జెండాలతో రైతుల నిరసన

రాజధానిగా అమరావతిని కొనసాగించాలని కోరుతూ 29 గ్రామాల్లో  ఆందోళనలు కొనసాగుతున్నాయి. తుళ్లూరు, మందడంలో రైతులు పెద్ద ఎత్తున దీక్షలో కూర్చుకున్నారు. సీఎం రాజీనామా చేయాలంటూ మహిళలు, రైతులు నినాదాలు చేశారు. మందడంలో దీక్షా శిబిరం వద్ద పలువురు రైతులు మాట్లాడుతూ.. వికేంద్రీకరణ బిల్లు ఆగాలని చేయని పూజలు లేవు, మొక్కని దేవుళ్లు లేరని తెలిపారు. తమ పూజలు ఫలించి ఇవాళ మండలిలో బిల్లు ఆగాలని ఆకాంక్షించారు. ప్రాణాలైనా ఇస్తాం..రాజధాని సాధిస్తామని స్పష్టం చేశారు. వెలగపూడిలోని దీక్షా శిబిరంలో రైతులు నల్ల జెండాలతో నిరసన తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. కొనసాగుతున్న పుర ఎన్నికల పోలింగ్‌

చెదురు మదురు ఘటనలు మినహా తెలంగాణలో పురపాలక ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. యాదగిరి గుట్ట మున్సిపాలిటీలో పోలింగ్‌ ఆలస్యంగా ప్రారంభమైంది. విద్యుత్‌ సరఫరా లేకపోవడంతో  7వ వార్డులోని 13వ పోలింగ్‌ కేంద్రంలో అరగంట ఆలస్యంగా పోలింగ్ ప్రక్రియ మొదలైంది. కనీస సౌకర్యాలు లేకపోవడంతో కింద కూర్చొనే విధులు నిర్వహిస్తున్నారు. ఓటర్లను గుర్తించేందు ఎన్నికల సంఘం తొలిసారిగా కొత్త విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేసింది. కొంపల్లిలోని 10 పోలింగ్‌ కేంద్రాల్లో అధికారులు పేస్‌ రికగ్నేషన్‌ యాప్‌ను ఉపయోగిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. మా ఎమ్మెల్యేలను రెచ్చగొడుతున్నారు: జగన్‌

‘జై అమరావతి’ అంటూ సభలో నినాదాలు చేస్తున్న తెదేపా సభ్యులపై సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ స్పీకర్‌ పోడియంను చుట్టుముట్టి మా సభ్యులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాలి.. చేతగాకపోతే బయట కూర్చోవాలి. మా సభ్యులను రెచ్చగొట్టి.. ఏదైనా అంటే వారికి అనుకూలంగా మార్చుకోవాలని చూస్తున్నారు. పదిమంది ఉన్నారు.. వీధి రౌడీల్లా ప్రవర్తిస్తున్నారు. స్పీకర్‌ పోడియం మెట్ల వద్ద మార్షల్స్‌ను పెట్టి అక్కడే అడ్డుకోవాలి. మార్షల్స్‌ సాయంతో ఆందోళన చేసేవారిని బయటపడేయాలి’’ అని స్పీకర్‌ను కోరారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఏపీ అసెంబ్లీలో ‘జై అమరావతి’ నినాదాలు

ఏపీ అసెంబ్లీలో మాటల యుద్ధం కొనసాగుతోంది. మూడో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన వెంటనే తెదేపా సభ్యులు ‘జై  అమరావతి, ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లాలి’ అంటూ నినాదాలు చేశారు. స్పీకర్‌ పోడియంను చుట్టుముట్టి నినాదాలు చేశారు. తెదేపా సభ్యులు ఆందోళన చేస్తుండగానే ..మంత్రులు తమ ప్రసంగం కొనసాగించారు. మంత్రి కన్నబాబు మాట్లాడుతూ... అమ్మ ఒడి, రైతు భరోసా లాంటి కీలక అంశాలపై సభలో చర్చ జరుగుతున్నప్పుడు తెదేపా సభ్యులు గందరగోళం  చేయడం తగదన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ‘సీఏఏ’పై స్టేకు సుప్రీం నిరాకరణ

పౌరసత్వ సవరణ చట్టం అమలు విషయమై సుప్రీంకోర్టులో కేంద్రానికి ఊరట లభించింది. ఈ చట్టంపై ఎలాంటి స్టే ఇవ్వబోమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే సీఏఏకు వ్యతిరేకంగా దాఖలైన కొత్త పిటిషన్లపై తమ స్పందన తెలియజేసేందుకు కేంద్రానికి నాలుగు వారాల గడువు ఇచ్చింది. అప్పటిదాకా సీఏఏపై హైకోర్టులు ఎలాంటి విచారణలు చేపట్టొద్దని, ఉత్తర్వులు ఇవ్వొద్దని ఆదేశించింది. దీంతో పాటు సీఏఏను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపేందుకు రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేస్తామని కోర్టు సూచనప్రాయంగా తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. అమిత్‌షాకు ప్రశాంత్‌ కిషోర్‌ సవాల్‌ 

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలను కొనసాగించుకోవచ్చంటూ కేంద్ర హోంమంత్రి అమిత్‌షా చేసిన వ్యాఖ్యలను జేడీయూ ఉపాధ్యక్షుడు  ప్రశాంత్‌ కిషోర్‌ తీవ్రంగా తప్పుబట్టారు. ప్రజల అసమ్మతిని తోసిపుచ్చడం ఏ ప్రభుత్వానికి బలం కాదని ఆయన హెచ్చరించారు. ‘ప్రజల అసమ్మతి ఏ ప్రభుత్వ బలానికి సంకేతం కాదు. అమిత్‌షాజీ సీఏఏ, ఎన్‌ఆర్‌సీకి వ్యతిరేకంగా చేస్తున్న ఆందోళనను మీరు పట్టించుకోకపోతే.. మరి ధైర్యంగా ప్రకటించినట్లుగా మీరు వాటిని అమలు చేసేందుకు ఎందుకు ప్రయత్నించడం లేదు’అంటూ ట్విటర్‌ ద్వారా సవాలు విసిరారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. బెజోస్‌ ఫోన్‌ హ్యాక్‌.. సౌదీ యువరాజు హస్తం?

ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ దిగ్గజం అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌ ఫోన్‌ 2018లో హ్యాకింగ్‌కు గురైనట్లు సమాచారం. సౌదీ అరేబియా యువరాజు మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌ వ్యక్తిగత మొబైల్‌ నుంచి పంపిన ఓ వాట్సాప్‌ సందేశం వల్లే హ్యాకింగ్‌ జరిగినట్లు ప్రముఖ ఆంగ్ల పత్రిక గార్డియన్‌ తన కథనంలో పేర్కొంది. ఆ సందేశం ద్వారా ఓ హానికరమైన వైరస్‌ బెజోస్‌ ఫోన్‌లో చొరబడినట్లు ఫోరెన్సిక్‌ విశ్లేషణ ఫలితాల్లో వెల్లడైనట్లు తెలుస్తోంది. వీరివురి మధ్య 2018, మే 1న జరిగిన స్నేహాపూర్వక చాటింగ్‌లో భాగంగా పంపిన ఓ వీడియో సందేశం ద్వారా బెజోస్‌ ఫోన్‌లో వైరస్‌  చొరబడినట్లు సమాచారం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ట్రంప్‌పై భారీ బహుమానం

ఐఆర్‌జీసీ ఖుద్స్‌ఫోర్స్‌ మేజర్‌ జనరల్‌ ఖాసిం సులేమాని హత్యకు ఇరాన్‌ ప్రతీకారం తీర్చిన వారికి భారీ బహుమానం ఇస్తామని ఆ దేశ పార్లమెంట్‌ సభ్యుడు ఒకరు ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను చంపిన వారికి మూడు మిలియన్‌ డాలర్ల బహుమానం ఇస్తానని అహ్మద్‌ హమ్జే అనే పార్లమెంటు సభ్యుడు ప్రకటించాడు. జనవరి 3వ తేదీన బాగ్దాద్‌ విమానాశ్రయం వద్ద అమెరికా జరిపిన డ్రోన్‌ దాడిలో సులేమానీ చనిపోయిన సంగతి తెలిసిందే. ఇరాన్‌లో సులేమాని స్వస్థలమైన కెర్మాన్‌ గ్రామం ఉన్న కహ్నౌజ్‌ ప్రాంతానికి అహ్మద్‌ హమ్జే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. విడాకులపై స్పందించిన శ్వేతాబసుప్రసాద్‌

‘కొత్తబంగారు లోకం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి శ్వేతాబసు ప్రసాద్‌. ఆ తర్వాత ఆమె దక్షిణాది చిత్రాలతోపాటు పలు బాలీవుడ్‌లో కూడా నటించారు. కొన్ని సంవత్సరాల ప్రేమ అనంతరం 2018లో ఫిల్మ్ మేకర్‌ రోహిత్‌ మిట్టల్‌ని ఆమె వివాహం చేసుకున్నారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల రోహిత్‌ నుంచి తాను విడిపోతున్నట్లు శ్వేతా గతేడాది ఇన్‌స్టా వేదికగా తెలిపారు. తాజాగా కోర్టు నుంచి విడాకులు తీసుకునేందుకు వీరిద్దరు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా పరస్పర అంగీకారంతోనే రోహిత్‌ మిట్టల్‌ నుంచి తాను విడిపోయినట్లు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. గుంటూరు జిల్లాలో కొనసాగుతున్న బంద్


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.