close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్ @ 1 PM

1. తుళ్లూరులో ప్రారంభమైన వాహన ర్యాలీ

ఏపీ రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ రాజధాని ప్రాంతంలో ఆందోళనలు  43వ రోజు కొనసాగుతున్నాయి. అమరావతి ఐకాస పిలుపు మేరకు తుళ్లూరు నుంచి మందడం వరకు చేపట్టిన భారీ వాహన ర్యాలీ ప్రారంభమైంది. ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో రైతులు, రైతుకూలీలు, మహిళలు పాల్గొన్నారు. కార్లు, ద్విచక్రవాహనాలు, ఆటోలు, ట్రాక్టర్లతో వేలాదిగా జనం ఈ ర్యాలీలో పాల్గొని నిరసన వ్యక్తం చేస్తున్నారు. జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్‌ అంటూ నినాదాలు చేస్తున్నారు. ఎండను సైతం లెక్కచేయకుండా పెద్ద ఎత్తున మహిళలు ఈ ర్యాలీలో పాల్గొనడం గమనార్హం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. కేసీఆర్‌ పతనానికి తుక్కుగూడ నాంది: లక్ష్మణ్‌

రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ మున్సిపాలిటీ రాష్ట్ర రాజకీయాలను ఆలోచింప చేస్తుందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ అన్నారు. ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చినప్పటికీ అక్రమంగా తుక్కుగూడ ఛైర్మన్ పీఠాన్ని దక్కించుకొని ప్రజా తీర్పును తెరాస అవమానించిందని ఆరోపించారు. తుక్కుగూడలో లక్ష్మణ్‌ మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్, కేసీఆర్ పతనానికి ఈ మున్సిపాలిటీ నాంది కాబోతోందన్నారు. తుక్కుగూడ ఛైర్మన్ పదవి నైతికంగా భాజపాదేనని, అధికారం కోసం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తెరాసలో చేరి నీచ రాజకీయాలకు పాల్పడ్డారని విమర్శించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. భారత్‌ X  న్యూజిలాండ్‌ మూడో టీ20 మ్యాచ్‌

అయిదు టీ20ల సిరీస్‌లో భాగంగా హామిల్టన్‌ వేదికగా కివీస్‌తో కోహ్లీసేన మూడో మ్యాచ్‌ ఆడనుంది. టాస్‌ గెలిచిన న్యూజిలాండ్‌ బౌలింగ్ ఎంచుకుంది. తొలి రెండు మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చిన ఆక్లాండ్‌లోని ఈడెన్‌ పార్క్‌తో పోలిస్తే హామిల్టన్‌ మైదానం పెద్దది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ కైవసం చేసుకోవాలని కోహ్లీసేన పట్టుదలతో ఉంది. లైవ్‌ బ్లాగ్‌ కోసం క్లిక్‌ చేయండి

4. ‘క్షమాభిక్ష’పై నిర్భయ దోషి పిటిషన్‌ కొట్టివేత

తన క్షమాభిక్ష అభ్యర్థనను రాష్ట్రపతి తిరస్కరించడాన్ని సవాల్‌ చేస్తూ నిర్భయ కేసు దోషి ముకేశ్‌ కుమార్‌ సింగ్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఈ కేసులో అన్ని పత్రాలు చూసిన తర్వాతే రాష్ట్రపతి క్షమాభిక్ష అభ్యర్థనపై నిర్ణయం తీసుకున్నారని కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో ట్రయల్‌ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పులను కేంద్ర హోంశాఖ రాష్ట్రపతికి అందజేసినట్లు తెలిపింది. ముకేశ్‌ వాదనలో ఎలాంటి మెరిట్‌ లేదని న్యాయస్థానం ఈ సందర్భంగా అభిప్రాయపడింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. కేంద్రమంత్రికి ఎన్నికల సంఘం నోటీసులు

కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌కు ఎన్నికల సంఘం(ఈసీ) షోకాజ్ నోటీసులు జారీ చేసింది. దిల్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటీవల ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు శాంతిసామరస్యతకు భంగం కలిగేలా ఉన్నట్లు ప్రాథమికంగా తేలిందని ఈసీ అభిప్రాయపడింది. జనవరి 30 మధ్యాహ్నం 12 గంటల కల్లా నోటీసులపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. లేనిపక్షంలో కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది హెచ్చరించింది. మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలపై దిల్లీ ప్రధాన ఎన్నికల అధికారి ఇప్పటికే నివేదిక సమర్పించారని ఈసీ తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. చాహల్‌.. నిన్ను ఏమన్నానో తెలుసుగా: గప్తిల్‌

ఇటీవల టీమిండియా స్పిన్నర్‌ యుజువేంద్ర చాహల్, న్యూజిలాండ్‌ ఓపెనర్‌ మార్టిన్‌ గప్తిల్‌ మధ్య జరిగిన సంభాషణ నెట్టింట్లో వైరల్‌గా మారింది. దీనిలో చాహల్‌ను ఉద్దేశిస్తూ గప్తిల్ హిందీలో ఓ అసభ్యకరమైన పదాన్ని అన్నాడు. అయితే గప్తిల్‌కు హిందీ రాకపోవడంతో చాహల్ సరదాగా తీసుకున్నాడు. కానీ ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుండటంతో గప్తిల్‌ వద్దకు చాహల్ వెళ్లి దీని గురించి చర్చించాడు. ‘‘గత రాత్రి నాతో ఏమన్నావ్‌?’’ అని గప్తిల్‌ను చాహల్ అడిగాడు. దీనికి గప్తిల్ ‘‘నిన్ను ఏమన్నానో నీకు తెలుసుగా’’ అని నవ్వుతూ సమాధానిమిచ్చి ఆ విషయాన్ని అక్కడితో ముగించాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ముళ్లు గీసుకున్నాయంతే: రజనీకాంత్‌

మ్యాన్‌ వర్సెస్‌ వైల్డ్‌’ డాక్యుమెంటరీ చిత్రీకరణలో తనకు పెద్దగా గాయాలేమీ కాలేదని సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ తెలిపారు. షూటింగ్‌ చేస్తుండగా.. చెట్టు కొమ్మలు, చిన్న ముళ్లు గీసుకున్నాయని అంతకు మించి గాయాలేమీ కాలేదని స్పష్టం చేశారు. అభిమానులెవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని..తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానన్నారు. షూటింగ్‌ అనంతరం మంగళవారం సాయంత్రం చెన్నై చేరుకున్న ఆయన అక్కడ విలేకరులతో మాట్లాడారు. ‘మ్యాన్‌ వర్సెస్‌ వైల్డ్‌’ పేరిట ఒక ఆంగ్ల ఛానల్‌ తీస్తున్న డాక్యుమెంటరీలో నటించేందుకు కర్ణాటకలోని గుండ్లుపేట అటవీ ప్రాంతానికి రజనీకాంత్‌ వెళ్లిన విషయం తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. పదిరోజుల్లో కరోనా మరింత తీవ్రరూపం?

అంతర్జాతీయ సమాజాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్న కరోనా వైరస్ రోజురోజుకీ పదుల సంఖ్యలో ప్రాణాల్ని బలిగొంటోంది. మంగళవారం ఒక్కరోజే 26 మంది మరణించారు. దీంతో కరోనా వైరస్ సోకి మరణించిన వారి సంఖ్య తాజాగా 132కి చేరింది. మరో 6000 మంది ఈ వైరస్‌ బారిన పడ్డట్లు వైద్యులు ధ్రువీకరించారు. వీరిలో 1,239 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ అంటువ్యాధికి కేంద్రంగా మారిన వుహాన్‌ నగరంలోనే ఇప్పటి వరకు 125 మంది ప్రాణాలు విడిచారు. మరో 3,554 మంది వైరస్‌తో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. తుళ్లూరులో అమరావతి రైతుల వాహన ర్యాలీ

10. భాజపాలో చేరిన సైనా నెహ్వాల్‌

ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌ భాజపాలో చేరింది. హరియాణాలో జన్మించిన సైనా భాజపాలో చేరతారన్న వార్తలు క్రీడా ప్రపంచంలో చర్చనీయాంశంగా మారాయి. బుధవారం ఆమె భాజపా తీర్థం పుచ్చుకుంది. దిల్లీ ఎన్నికలు జరగనున్న వేళ ఆమె భాజపాలో చేరడం గమనార్హం. 24కి పైగా అంతర్జాతీయ టైటెల్స్‌ గెలుచుకున్న సైనా నెహ్వాల్‌ 2009లో వరల్డ్‌ నంబర్‌ 2, 2015లో వరల్డ్‌ నంబర్‌ 1 ఛాంపియన్‌గా నిలిచి రికార్డు సృష్టించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.