close
Array ( ) 1

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్ @ 1 PM

1. కృష్ణకిశోర్‌ సస్పెన్షన్‌ రద్దు చేసిన క్యాట్‌

కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్‌ లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. ఐఆర్‌ఎస్‌ అధికారి జాస్తి కృష్ణ కిషోర్‌ సస్పెన్షన్‌ను క్యాట్‌ రద్దు చేసింది. ఆయన తిరిగి కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు ట్రైబ్యునల్‌ అనుమతిచ్చింది. కృష్ణ కిశోర్‌పై ఉన్న కేసును రాష్ట్ర ప్రభుత్వం చట్ట ప్రకారం పరిశీలించుకోవచ్చని స్పష్టం చేసింది. గత ప్రభుత్వంలో ఏపీ ఆర్థిక అభివృద్ధి మండలి సీఈవోగా పనిచేసిన కృష్ణకిశోర్‌పై అవినీతి ఆరోపణలు రావడంతో సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల 

55 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్‌ను మంగళవారం కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. మొత్తం 17 రాష్ట్రాల నుంచి 55 రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్ లో 4, తెలంగాణలో 2 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలో కేవీపీ రామచంద్రరావు, గరికపాటి మోహన్‌రావు, ఆంధ్రప్రదేశ్‌లో కె.కేశవరావు, తోట సీతారామలక్ష్మి, ఎం.ఎ.ఖాన్‌, సుబ్బరామిరెడ్డి స్థానాలు ఖాళీ కానున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. ఆరుగురు సుప్రీంకోర్టు జడ్జీలకు స్వైన్‌ ఫ్లూ

దేశ రాజధానిలో స్వైన్‌ ఫ్లూ విజృంభిస్తోంది. తాజాగా ఆరుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు స్వైన్‌ ఫ్లూ బారిన పడినట్లు జస్టిస్‌ చంద్రచూడ్‌ తెలిపారు. సుప్రీంకోర్టులో పనిచేసే వారికి స్వైన్‌ ఫ్లూ రాకుండా నివారణ చర్యలు తీసుకోవాలని సీజేఐని కోరినట్లు పేర్కొన్నారు. దీనిపై సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌తో సీజే జస్టిస్‌ బోబ్డే సమావేశం నిర్వహించారని, సుప్రీంకోర్టులో పనిచేసే వారికి స్వైన్‌ ఫ్లూ రాకుండా నివారణ చర్యలపై చర్చించినట్లు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. మహాత్ముడికి ట్రంప్‌ నివాళులు

భారత పర్యటనలో ఉన్న అగ్రరాజ్యాధినేత డొనాల్డ్‌ ట్రంప్‌ జాతిపిత మహాత్మాగాంధీ స్మారక స్థలం రాజ్‌ఘాట్‌ను సందర్శించారు. బాపూజీ సమాధి వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. అక్కడి సందర్శకుల పుస్తకంలో తన సందేశాన్ని రాశారు. ఈ సందర్భంగా భారత ప్రతినిధులు ట్రంప్‌ దంపతులకు మహాత్ముడి ప్రతిమను బహుమతిగా ఇచ్చారు. అనంతరం రాజ్‌ఘాట్‌ ప్రాంగణంలో ట్రంప్‌ ఓ మొక్కను నాటారు. రాజ్‌ఘాట్‌ నుంచి నేరుగా హైదరాబాద్‌ హౌస్‌కు బయల్దేరారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. వారిని వదిలిపెట్టం: కిషన్‌రెడ్డి

సీఏఏకు వ్యతిరేకంగా హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్న వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. సీఏఏతో మైనార్టీలకు నష్టం జరగదన్న ఆయన.. దిగజారుడు రాజకీయాలు సరికాదని మండిపడ్డారు. మోదీని, భాజపాను రాజకీయంగా ఎదుర్కోవాలి తప్ప మతపరంగా రెచ్చగొట్టడం సరికాదని పేర్కొన్నారు. దిల్లీలో పథకం ప్రకారం హింసకు పాల్పడ్డారని, ఒక చేతిలో జాతీయ జెండా, మరో చేతిలో రాళ్లు పట్టుకోవడం ఉద్యమమా?అని ఆందోళనకారులను ప్రశ్నించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. దిల్లీలో ఆగని ఆందోళనలు..

ఈశాన్య దిల్లీలో సోమవారం చెలరేగిన అల్లర్లు మంగళవారం తెల్లవారుజాము వరకు కొనసాగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో మొత్తం ఇప్పటి వరకు ఆరుగురు ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించారు. మృతుల్లో హెడ్‌కానిస్టేబుల్‌  కూడా ఉన్నారు. తెల్లవారుజాము వరకు ఆందోళనకారులు దాడులకు పాల్పడ్డారని.. అర్ధరాత్రి వేళ ఓ అగ్నిమాపక యంత్రానికి నిప్పుపెట్టారని తెలిపారు. మంటల్ని అదుపు చేయడానికి వచ్చిన మరిన్ని అగ్నిమాపక యంత్రాలపై నిరసకారులు రాళ్లు రువ్వారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. రాష్ట్రపతి భవన్‌లో ట్రంప్‌కు ఘనస్వాగతం

8. కోహ్లీ వైఫల్యమే ప్రధాన కారణం: మంజ్రేకర్‌

తొలి టెస్టులో టీమ్‌ఇండియా ఘోర ఓటమికి కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ బ్యాటింగ్‌ వైఫల్యమే ప్రధాన కారణమని మాజీ క్రికెటర్‌, వ్యాఖ్యాత సంజయ్‌ మంజ్రేకర్‌ అభిప్రాయపడ్డాడు. ‘రెండు ఇన్నింగ్స్‌ల్లో కోహ్లీ త్వరగా ఔటవ్వడమే ప్రధాన కారణం. ఒకవేళ అతడు బాగా ఆడి మంచి పరుగులు సాధించి ఉంటే న్యూజిలాండ్‌ ప్రణాళికలు అమలయ్యేవి కావు. కానీ, కివీస్‌ జట్టు తమ ప్రణాళికలను కచ్చితంగా అమలుచేసింది. టీమ్‌ఇండియా కౌంటర్‌ అటాకింగ్‌ చేయడానికి ఎవరూ నిలవలేకపోయారు. అందువల్లే టీమ్‌ఇండియా గెలవలేకపోయింది’ అని మంజ్రేకర్‌ వివరించాడు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. దిల్లీ స్కూల్‌ను సందర్శించిన మెలానియా

అగ్రరాజ్యాధినేత డొనాల్డ్‌ ట్రంప్‌ దంపతుల భారత పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. అధ్యక్షుడు ట్రంప్‌ నేడు ప్రధాని మోదీతో ద్వైపాక్షిక భేటీలో పాల్గొనగా అమెరికా ప్రథమ మహిళా మెలానియా దిల్లీలోని ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. దక్షిణ మోతీబాగ్‌ ప్రాంతంలోని సర్వోదయ కో ఎడ్యుకేషనల్‌ సీనియర్‌ సెకండరీ స్కూల్‌కు వచ్చిన మెలానియాకు అక్కడి విద్యార్థులు, సిబ్బంది ఘన స్వాగతం పలికారు. మెలానియా నుదుట కుంకుమ పెట్టి సంప్రదాయ పద్ధతిలో ఆమెను స్వాగతించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. ‘అవసరమైతే రాజధాని రైతుల తరపు సుప్రీంలో వాదిస్తాం’


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.