close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 26/03/2020 13:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్ @ 1 PM

1. విద్యార్థులను ఖాళీ చేయించొద్దు: తలసాని

సనత్‌నగర్‌ నయోజకవర్గ పరిధిలోని పలు దుకాణాలను, సూపర్ మార్కెట్లను తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ తనిఖీ చేశారు. ఎర్రగడ్డ మార్కెట్ లో పరిస్థితిని పరిశీంచిన తర్వాత యూసఫ్ గూడలోని ఓ సూపర్ మార్కెట్ ను తనిఖీ చేశారు. మార్కెట్ రేటుకు ఇక్కడకు 15 రూపాయలు తేడా ఉండటంతో యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇలాంటి చర్యలకు పాల్పడితే పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అనంతరం వసతిగృహాల నిర్వాహకులతో మంత్రి సమావేశమయ్యారు. వసతిగృహాల నుంచి విద్యార్థులను ఖాళీ చేయించొద్దని సూచించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. కరోనాపై పోరుకు పవన్‌ రూ.2కోట్లు విరాళం

కరోనా మహమ్మారిపై పోరుకు విరాళాలు భారీగా వస్తున్నాయి. నివారణ చర్యల కోసం జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తెలుగు రాష్ట్రాలకు కోటి రూపాయలు, ప్రధాన మంత్రి సహాయనిధికి రూ.కోటి విరాళంగా ప్రకటించారు. ప్రధాన మంత్రి సహాయనిధికి రూ. కోటి, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.50లక్షలు, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.50లక్షల చొప్పున అందజేస్తానని పవన్‌ కల్యాణ్‌ ట్విటర్‌లో వెల్లడించారు. ప్రధాని తీసుకుంటున్న చర్యలు కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు ఉపయోగపడతాయని విశ్వాసం వెలిబుచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. కరోనా:  20,000 మృతి, లాక్‌డౌన్‌లో 300 కోట్లమంది

కరోనా వైరస్‌ (కొవిడ్‌-19) వ్యాప్తి నిరోధానికి ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాయి. ఈ చర్యల ఫలితంగా మూడు బిలియన్లు అంటే 300 కోట్ల మందికి పైగా ప్రజలు లాక్‌డౌన్‌లో ఉంటున్నారు. కాగా, అంతర్జాతీయంగా కరోనా మృతుల సంఖ్య బుధవారం నాటికి 20,000కు చేరుకుంది. ఇక కరోనా బాధితుల సంఖ్య 4,50,000 కు చేరిన నేపథ్యంలో... ప్రపంచ దేశాల ఏకీకృత చర్యల ద్వారా మాత్రమే వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోగలమని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌ మరోమారు స్పష్టం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. భారత్‌లో కరోనా: 649కేసులు, 13 మరణాలు

భారత్‌లో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటికే దేశంలోని 26రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు ఈ వైరస్‌ పాకింది. గురువారం నాటికి దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ నిర్థారణ కేసుల సంఖ్య 649కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది. కొవిడ్‌-19కారణంగా ఇప్పటివరకు మొత్తం 13మంది మృతి చెందినట్లు ప్రకటించింది. మొత్తం బాధితుల్లో 43మంది కోలుకోగా 593మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. అమరావతి దీక్ష రైతులు.. కరోనాపై అవగాహన

6. ఆ నిర్ణయం తీసుకోవడం మంచిది: గోపీచంద్‌

టోక్యో ఒలింపిక్స్‌ను వాయిదా వేయడం చాలా మంచి నిర్ణయమని భారత బ్యాడ్మింటన్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ అభిప్రాయపడ్డారు. ‘ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులు చూస్తుంటే అంతర్జాతీయ ఒలింపిక్స్‌ సమాఖ్య(ఐఓసీ) తీసుకున్న వాయిదా నిర్ణయం చాలా మంచిది. ఇలాంటి సమయంలో క్రీడల గురించి ఆలోచించడం ఆటగాళ్లకు, సహాయక సిబ్బందికి ఒత్తిడిగా ఉంటుంది. ఈ నిర్ణయం సరైనదే. ఐఓసీ చాలా మంచి పనిచేసింది. ఈ నిర్ణయం తీసుకోడంలో వారం, పది రోజులు ఆలస్యమైనా, చివరికి సరైన సమయంలో స్పందించింది’ అని గోపీచంద్‌ అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. అమెరికాలో 1,000 దాటిన కరోనా మృతులు!

కరోనా వైరస్‌ అగ్రరాజ్యం అమెరికాలో మరణమృదంగం మోగిస్తోంది. తాజాగా దేశవ్యాప్తంగా 68,472 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 1,032మంది మరణించారు. కేవలం బుధవారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 223కరోనా మరణాలు నమోదయ్యాయి. అంతకుముందు రోజు మంగళవారం 164మరణించారు. నాలుగు రోజుల క్రితం 300మరణాలు ఉండగా ప్రస్తుతం వెయ్యి దాటడం ఆందోళన కలిగిస్తోంది.  చైనా, ఇటలీ వెలుపల అత్యధిక కొవిడ్‌-19 కేసులు అమెరికాలోనే నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఆరోగ్య అత్యయికస్థితి ప్రకటించిన విషయం తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. నేను చేసిందే మీరూ చేయండి: సచిన్‌

కరోనా(కొవిడ్‌ 19) మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రధాని నరేంద్రమోదీ చెప్పినట్టు 21 రోజులు గృహ నిర్బంధంలో ఉండాలని క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశాడు. ట్విటర్‌ వేదికగా ఓ వీడియో పంచుకున్న లిటిల్‌మాస్టర్‌ తాను కూడా ఇంట్లోనే ఉంటున్నట్లు చెప్పాడు. ప్రభుత్వంతో పాటు, వైద్య సిబ్బంది ఎంతచెప్పినా చాలా మంది పెడచెవిన పెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశాడు. తాను కూడా కుటుంబంతో పాటు 21 రోజులు ఇంట్లోనే ఉంటున్నానని, ప్రజలు కూడా ఎవరింట్లో వాళ్లుండాలని కోరాడు. అంతకుముందు కూడా సచిన్‌ ఓ ట్వీట్‌ చేశాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. తెలుగు రాష్ట్రాలకు త్రివిక్రమ్ విరాళం

ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ రెండు తెలుగు రాష్ట్రాలకు తన వంతు విరాళాన్ని అందించనున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తోన్న నేపథ్యంలో ఆ మహమ్మారి కట్టడికి కోసం కృషి చేస్తోన్న ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు పలువురు ప్రముఖులు సాయం అందిస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ తనవంతు సాయంగా తెలంగాణకు రూ.10 లక్షలు, ఆంధ్రప్రదేశ్‌కు రూ.10 లక్షలు విరాళంగా అందించనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. కరోనా.. ముఖానికి ప్లాస్టిక్‌ కవర్‌తో నటి

ముఖానికి ప్లాస్టిక్‌ కవర్‌ కట్టుకుని కరోనా వైరస్‌పై అవగాహన కల్పించారు బాలీవుడ్‌ నటి షెఫాలి షా. కరోనా లక్షణాలు కనపడిన వెంటనే వైద్యుడిని సంప్రదించకపోతే మన ఊపిరితిత్తులు ఎలాంటి సమస్యను ఎదుర్కొంటాయనే విషయంపై ఆమె ప్రజలకు అవగాహన కల్పించారు. ముఖానికి ఓ ప్లాస్టిక్‌ కవర్‌ కట్టుకుని ఓ వీడియోను రూపొందించి ఇన్‌స్టా వేదికగా ఆమె షేర్‌ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.