close
Array ( ) 1

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్ @ 1 PM

1. ఏపీలో 40కి చేరిన కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 40కి చేరింది. రాత్రి 9గంటల నుంచి ఇప్పటి వరకు కొత్తగా 17 కరోనా కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. బాధితుల్లో దిల్లీలో మత పరమైన ప్రార్థనలకు వెళ్లివచ్చిన వారే ఎక్కువమంది ఉన్నారని ప్రభుత్వం హెల్త్‌ బులెటిన్‌లో తెలిపింది. ఇప్పటి వరకు నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య జిల్లాల వారీగా ఇలా ఉంది. ప్రకాశం 11, గుంటూరు 9, విశాఖపట్నం 6, కృష్ణా 5, తూర్పుగోదావరి 4, అనంతపురం 2, చిత్తూరు, నెల్లూరు, కర్నూలు ఒక్కో కేసు నమోదయ్యాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. హెచ్‌-1బీ వీసాదారుల్లో ఆందోళన..?

కరోనా ప్రభావం ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావమే చూపుతోంది. ఈ విషయాన్ని అనేక అంతర్జాతీయ సంస్థలు, ప్రభుత్వాలు సైతం ధ్రువీకరిస్తున్నాయి. ఈ క్రమంలో వేలాది మంది ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉంది. దీంతో అమెరికాలో ఉన్న హెచ్‌-1బీ వీసాదారుల్లో ఆందోళన మొదలైంది. అగ్రరాజ్యంలో అనేక కంపెనీలు ఆర్థికంగా తీవ్ర ఒడుదొడుకులు ఎదుర్కొనే అవకాశం ఉందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. దీంతో నష్టాల్ని పూడ్చుకునేందుకు ఆయా సంస్థలు రానున్న కొన్ని వారాల్లో భారీ స్థాయిలో ఉద్యోగాల్లో కోత విధించే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. దిక్కుతోచని స్థితిలో రైతులు: పవన్‌

లాక్‌డౌన్‌ కారణంగా భవన నిర్మాణ కార్మికులు, ఉద్యాన, ఆక్వా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. రాష్ట్రంలో 21లక్షల మంది గుర్తింపు పొందిన భవన నిర్మాణ కార్మికులు ఉన్నారని, మరో 30లక్షల మంది వరకు గుర్తింపు పొందని కూలీలు ఉన్నారని తెలిపారు. కేంద్ర కార్మికశాఖ మంత్రి .. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల పరిపాలనాధికారులకు నిధులు విడుదల చేసేలా లేఖలు రాశారని ఈ సందర్భంగా పవన్‌ గుర్తు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. స్పెయిన్‌లో అంత్యక్రియలపైనా ఆంక్షలు..!

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌(కొవిడ్‌-19) సృష్టిస్తున్న వీరంగం అంతా ఇంతా కాదు. ఈ దెబ్బకు ఇప్పటికే అనేక దేశాలు విధించిన ఆంక్షలు రోజురోజుకీ మరింత కఠినతరం అవుతున్నాయి. దీంతో అనేక దేశ రాజధానులు బోసిపోయి కనిపిస్తున్నాయి. నౌకలు, రైళ్లు ఆస్పత్రులుగా మారుతున్నాయి. సాంస్కృతిక, క్రీడా ఉత్సవాలు పూర్తిగా రద్దయ్యాయి. రోజురోజుకీ కరోనా తీవ్రత ఎక్కవవుతుండడంతో ఈ ఆంక్షలు మరికొన్ని రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. స్పెయిన్‌లో అయితే కరోనా ఉగ్రరూపం చూపిస్తోంది. అక్కడి ప్రభుత్వం ఏకంగా సంప్రదాయబద్ధంగా అంత్యక్రియలను జరపడాన్ని నిషేధించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. భారత్‌లో పెరిగిన కరోనా మరణాలు..

దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ బాధితుల సంఖ్య 1251కి చేరగా.. మృతుల సంఖ్య 32గా నమోదైంది. అయితే తెలంగాణ సహా ఇతర రాష్ట్రాల్లో నిన్న నమోదైన మృతుల సంఖ్యను కేంద్ర ప్రభుత్వం అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. మహారాష్ట్రలో కొవిడ్‌-19 తీవ్రత అధికంగా ఉంది. తాజాగా ఇక్కడ మృతుల సంఖ్య 8కు చేరింది. ఇప్పటికే రాష్ట్రంలో 225కేసులు నమోదుకాగా 25మంది కోలుకున్నట్లు అధికారులు వెల్లడించారు. లైవ్‌ బ్లాగ్‌ కోసం క్లిక్‌ చేయండి

6. కరోనా హెల్ప్‌లైన్‌కు ఫోన్‌ చేసి సమోసాల ఆర్డర్‌

కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ప్రజల కోసం హెల్ప్‌లైన్లు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కరోనాపై ప్రజలకు అవసరమైన సమాచారాన్ని అందిస్తూ ఇవి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. అయితే కొందరు ఆకతాయిలు మాత్రం వీటిని దుర్వినియోగం చేస్తున్నారు. అలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌లో చోటుచేసుకుంది.  హెల్ప్‌లైన్‌కు ఓ వ్యక్తి ఫోన్‌చేసి నాలుగు సమోసాలు తెమ్మని డిమాండ్‌ చేశాడు. దీంతో అధికారులు అతడికి తగిన శిక్ష కూడా విధించారు. రాంపూర్‌ డిస్ట్రిక్ట్‌ మెజిస్ట్రేట్‌ ఆంజనేయ కుమార్‌ సింగ్‌ ట్విటర్‌లో ఈ విషయాన్ని వెల్లడించడంతో వైరల్‌గా మారింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. సానియా.. రూ.1.25 కోట్ల నిధుల సేకరణ

కరోనా వైరస్‌(కొవిడ్‌ 19) నేపథ్యంలో భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మిర్జా రూ.1.25 కోట్ల విరాళాలు సేకరించినట్లు చెప్పారు. గతవారం ఒక బృందంగా ఏర్పడి అవసరమైన వారికి సహాయం చేయాలని నిర్ణయించుకున్నామన్నారు. తద్వారా వేల కుటుంబాలకు భోజన సౌకర్యం కల్పించామని తెలిపారు. తాము సేకరించిన రూ.1.25 కోట్లు సుమారు లక్ష మందికి ఉపయోగపడతాయని ఆశాభావం వ్యక్తంచేశారు. యూత్‌ఫీడ్‌ఇండియా, సఫాఇండియా స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ఇప్పుడూ విరాళాలు సేకరిస్తున్నామని సానియా ట్విటర్‌లో పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. అమెరికాలో 3,000 దాటిన మృతుల సంఖ్య

అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్‌ బారినపడి మృతిచెందిన వారి సంఖ్య మూడు వేలు దాటింది. సోమవారం ఆ దేశం ఓ చేదు అనుభవాన్నే చవిచూసింది. నిన్న ఒక్కరోజే ఏకంగా 540 మందిమృత్యువాత పడ్డారు. దీంతో వైరస్‌తో పోరాడుతూ మరణించిన వారి సంఖ్య 3017కు పెరిగింది. ఇక వైరస్‌ బారిన పడ్డవారి సంఖ్య 1,63,000లకు చేరింది. న్యూయార్క్‌, న్యూజెర్సీ రాష్ట్రాల్లో వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఇతర వ్యాధులతో బాధపడుతున్న వారి చికిత్సకు ఆస్పత్రులే కరవయ్యాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. చిత్ర పరిశ్రమలోపుట్టుకల్ని మార్చగలరా..?

బుల్లితెర నటిగా కెరీర్‌ ఆరంభించి కథానాయికగా ఎదిగిన ముద్దుగుమ్మ యామీ గౌతమ్‌. తాజాగా ఆమె ఓ వెబ్‌సైట్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా చిత్ర పరిశ్రమలో బంధుప్రీతిపై జరుగుతున్న వివాదం గురించి ముచ్చటించారు. ‘ఇక్కడ అలాంటి గొడవలేమీ జరగడం లేదు. చిత్ర పరిశ్రమలో ఒకరి పుట్టుకను మీరు మార్చలేరు. మీరే కాదు ఎవరూ దీన్ని ఆపలేరు. అంతేకాదు నేను ఎక్కడి నుంచి వచ్చానో దాన్ని కూడా మార్చలేరు. ఇది నిజం కదా? మరి నిజాల్ని స్వీకరించడానికి సమస్య ఏంటి? కానీ ఓ అవకాశం మనకు వచ్చిందంటే.. దాని వెనుక శ్రమ కచ్చితంగా ఉంటుంది’ అని అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. నా గురించి ఆందోళన చెందొద్దు: ఉమేశ్‌ యాదవ్‌  

టీమ్‌ఇండియా 2018 నుంచి ఇప్పటివరకు 54 వన్డేలు, 24 టెస్టు మ్యాచ్‌లు ఆడింది. అందులో ఉమేశ్‌ యాదవ్‌ ఆడింది 4 వన్డేలు, 10 టెస్టులు. ఉమేశ్‌ జాతీయ జట్టులో చేరి ఎనిమిదేళ్లు గడుస్తున్నా అతడి కెరీర్‌ ఎలా సాగుతుందో చెప్పడానికి ఈ గణంకాలే నిదర్శనం. తాజాగా ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన టీమ్‌ఇండియా పేసర్‌.. తన నైపుణ్యాన్ని ప్రజలు తప్పుగా అర్థం చేసుకుంటున్నారని అన్నాడు. బంతి తెల్లదైనా, ఎర్రదైనా దాన్ని స్వింగ్‌ చేయడమే నైపుణ్యమని, ఇదివరకే తాను అది చేశానని.. ఇకపైనా చేయగలనని స్పష్టం చేశాడు. వరుసగా పలు వన్డే సిరీసుల్లో అవకాశాలిస్తే వికెట్లు తీసే బౌలర్‌గా నిరూపించుకుంటానని చెప్పాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.