టాప్‌ 10 న్యూస్ @ 1 PM
close

తాజా వార్తలు

Updated : 02/04/2020 13:02 IST

టాప్‌ 10 న్యూస్ @ 1 PM

1. నిరాడంబరంగా రాములవారి కల్యాణోత్సవం

భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయంలో శ్రీరామ నవమి సందర్భంగా స్వామి వారి కల్యాణమహోత్సవం కన్నులపండువగా జరిగింది. లాక్‌డౌన్‌ ప్రభావంతో భక్తులకు ప్రవేశం లేకుండా కోవెల ప్రాంగణంలో నిరాడంబరంగా ఈ వేడుకను నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, జిల్లా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, ప్రభుత్వ సలహాదారు రమణాచారి ఆలయ అర్చకులకు అందజేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ఏపీలో 132కు చేరిన కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల వివరాలను వెల్లడిస్తూ ఏపీ వైద్య ఆరోగ్యశాఖ గురువారం ఉదయం బులెటిన్ విడుదల చేసింది. ఇవాళ ఒక్కరోజే కొత్తగా 21 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో 20 చొప్పున, ప్రకాశం జిల్లాలో 17, కడప, కృష్ణా జిల్లాల్లో 15 చొప్పున , పశ్చిమగోదావరి జిల్లాలో 14, విశాఖ జిల్లాలో 11, చిత్తూరు జిల్లాలో 8, తూర్పుగోదావరి జిల్లాలో 9 అనంతపురంజిల్లాలో 2 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. వారిని క్షమించేది లేదు: కేటీఆర్‌

సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో వైద్యులపై జరిగిన దాడిని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ఖండించారు. అదేవిధంగా నిజామాబాద్‌లో వైద్య సిబ్బందిని అడ్డుకోవడాన్ని కూడా తీవ్రంగా పరిగణిస్తున్నట్లు ట్విటర్‌ ద్వారా స్పష్టం చేశారు. ‘‘విపత్కర పరిస్థితుల్లో వైద్య సేవలందిస్తున్న సిబ్బందిపై ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిని క్షమించేది లేదు.. వారు సమాజానికి భారం.  తెలంగాణ ప్రభుత్వం ఈ ఘటనను తీవ్రంగా పరిగణిస్తోంది’’  అని  పేర్కొన్నారు. ఇలాంటి వారి వల్ల ఇతరులకు కూడా ఎంతో ప్రమాదముందని అభిప్రాయపడ్డారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఆదాయం తగ్గిపోయింది...ఆదుకోండి: జగన్‌

కరోనా పరిస్థితిపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ గురువారం వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి.. కరోనా వ్యాప్తిని నివారించేందుకు రాష్ట్రంలో తీసుకుంటున్న చర్యలను ప్రధానికి వివరించారు. గడచిన రెండు రోజుల్లో కేసుల సంఖ్య పెరగడానికి గల కారణాలను వెల్లడించారు. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్‌లో నమోదైన 132 కరోనా పాజిటివ్‌ కేసుల్లో 111 మంది జమాత్‌కు వెళ్లిన వారు, వారితో కాంటాక్టులో ఉన్నావారేనని సీఎం తెలిపారు. రాష్ట్ర ఆదాయం బాగా దెబ్బతిందని, తగిన విధంగా ఆదుకోవాలని కోరారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. భారత్‌లో 50కి చేరిన కరోనా మరణాలు!

ప్రపంచాన్ని పీడిస్తోన్న కరోనా వైరస్‌ భారత్‌లోనూ విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా ఈ వైరస్ తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. గురువారంనాటికి దేశంలో కరోనా బాధితుల సంఖ్య 1965కి చేరిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. వీరిలో 50మంది మరణించగా 1764మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారని ప్రకటించింది. మరో 151మంది కొవిడ్‌-19 నుంచి కోలుకున్నారని తెలిపింది. మహారాష్ట్రలో కొవిడ్‌-19 తీవ్రత అధికంగా ఉంది. తాజాగా ఇక్కడ మృతుల సంఖ్య 13కు చేరగా మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 335గా ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. FWICEకి అజయ్‌ దేవగణ్‌ విరాళం

బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగణ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ వెస్ట్రన్‌ ఇండియా సినీ ఎంప్లాయిస్‌కు రూ.51 లక్షలు విరాళంగా అందించారు. రోజు రోజుకు విజృంభిస్తోన్న కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా 21 రోజులపాటు లాక్‌డౌన్‌ విధించిన విషయం విధితమే. లాక్‌డౌన్‌ను స్వాగతిస్తూ దేశవ్యాప్తంగా పలు రంగాలు మూతపడ్డాయి. సినీ పరిశ్రమ సైతం షూటింగ్స్‌ను వాయిదా వేయడంతో ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్న రోజువారీ సినీ కార్మికులు ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ‘మేం భారతీయులం హిందీలోనే మాట్లాడతాం’

టీమ్‌ఇండియా వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌శర్మ.. పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రాతో లైవ్‌చాట్‌లో మాట్లాడుతుండగా కామెంట్‌ చేసిన అభిమానులపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. లాక్‌డౌన్‌ కారణంగా క్రికెటర్లంతా ఇళ్లకే పరిమితమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రోహిత్ సోషల్‌మీడియాలో పలువురు క్రికెటర్లతో లైవ్‌చాట్‌ చేస్తున్నాడు. బుమ్రాతో హిందీలో మాట్లాడుతుండగా కొందరు అభిమానులు ఇంగ్లీష్‌లో మాట్లాడమని అడిగారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన రోహిత్‌.. అభిమానులు ఇంగ్లీష్‌లో మాట్లాడమని చెబుతున్నారని, తాము భారతీయులం అయినందున హిందీలోనే మాట్లాడతామని స్పష్టంచేశాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. అమెరికాలో ఒక్కరోజే 884 మరణాలు!

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌ మహమ్మారితో అమెరికా అతలాకుతలం అవుతోంది. రోజురోజుకు రికార్డు స్థాయిలో మరణాలు సంభవిస్తున్నాయి. తాజాగా బుధవారం ఒక్కరోజే దేశంలో అత్యధికంగా 884మంది కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటివరకు ఈ వైరస్‌తో మరణించిన వారిసంఖ్య 5,093కు చేరింది. 2లక్షల 14వేల మంది ఈ వైరస్‌ బారినపడినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వెల్లడించారు. ప్రపంచంలోనే అత్యధిక కరోనా కేసులు అమెరికాలో నమోదయ్యాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. చైనా కరోనా లెక్కలపై ట్రంప్‌ సందేహం

కరోనా వైరస్‌ పుట్టుకకు కారణమైన చైనా కంటే అమెరికాలో బాధితుల సంఖ్య అధికంగా నమోదవ్వడంతో అమెరికా అధ్యక్షడు డొనాల్డ్‌ ట్రంప్‌ సందేహం వ్యక్తం చేశారు. చైనాలో కరోనా బాధితుల లెక్కలపై అనుమానం వ్యక్తం చేశారు. వైరస్‌ బాధితులు, మృతుల సంఖ్యలో బీజింగ్‌ గోప్యత పాటించిందనే విషయాన్ని ఇంటెలిజెన్స్‌ నివేదికలో పేర్కొన్నారంటూ చట్ట సభ్యులు గుర్తించిన అనంతరం ట్రంప్‌ బుధవారం మీడియాతో మాట్లాడారు. చైనా లెక్కలు నిజమనే విషయం మనకెలా తెలుస్తుందని ప్రశ్నించారు. చైనా చెప్పిన లెక్కలకన్నా ఆ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. మద్యం దొరకడం లేదని హానికర ద్రవాలు తాగొద్దుTags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని