close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 28/05/2020 12:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్ @ 1 PM

1. ‘పుల్వామా’ తరహా కుట్ర భగ్నం!

పుల్వామాలో భారీ పేలుళ్లు జరిపేందుకు ఉగ్రవాదులు పన్నిన కుట్రను భద్రతా బలగాలు ఛేదించాయి. 2019లో 40మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లు పొట్టనపెట్టుకున్న ఉగ్రవాదులు మరోమారు అదే తరహా కుట్ర అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. చివరి నిమిషంలో పేలడానికి సిద్ధంగా ఉన్న కారు బాంబును భద్రతా దళాలు గుర్తించి ధ్వంసం చేశాయి. విశ్వసనీయ సమాచారంతో రంగంలోకి దిగిన సీఆర్‌పీఎఫ్‌, ఆర్మీ, పోలీసులు ఈ ఆపరేషన్‌ నిర్వహించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ఏపీలో మరో 54 కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 9,858 మంది నమూనాలు పరీక్షించగా..54 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,841కి చేరింది. కరోనాతో ఇవాళ కర్నూలు జిల్లాలో ఒకరు మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 59కి చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది డిశ్చార్జి అయిన బాధితుల సంఖ్య 1958కి చేరింది. ప్రస్తుతం వివిధ ఆసుపత్రుల్లో 824 మంది చికిత్స పొందుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఎన్టీఆర్‌ అంటేనే ఒక స్ఫూర్తి: చంద్రబాబు

ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చి కోట్లాది మంది సామాన్యులకు అండగా నిలిచిన మేరు నగధీరుడు నందమూరి తారకరామారావు అని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కొనియాడారు. ఎన్టీఆర్‌ అంటేనే ఒక స్ఫూర్తి, ఒక ఆదర్శమన్నారు. ఆయన కృషి, క్రమశిక్షణ పట్టుదల, చిత్తశుద్ధి, దీక్షాదక్షత ప్రతి ఒక్కరికీ మార్గదర్శకమన్నారు. ఎన్టీఆర్‌ మానవతా దృక్పథం, సేవా నిరతి, సామాజిక సంస్కరణాభిలాష, నమ్ముకున్న ప్రజలకు మంచి చేయడం కోసం ఎంతటికైనా తెగించగల సాహసం తరతరాలకు ఆదర్శమని పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. తితిదే ఆస్తులు వెబ్‌సైట్‌లో?

తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి సమావేశమైంది. తితిదే ఛైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డితో పాటు ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌, అదనపు ఈవో ధర్మారెడ్డి, జేఈవోలు బసంత్‌ కుమార్‌, భార్గవి, బోర్డు సభ్యులు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాలక మండలి సభ్యుడు శేఖర్‌రెడ్డి.. తితిదే ఆస్తులను వెబ్‌సైట్‌లో ఉంచాలని కోరారు. ఈ అంశమే టేబుల్‌ అజెండాగా సమావేశంలో ప్రతిపాదించారు. శేఖర్‌రెడ్డి ప్రతిపాదనకు తితిదే ఛైర్మన్‌ సానుకూలంగా స్పందించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. వరద ప్రవాహం లేకపోవడంతో ఆక్రమించిన కబ్జాదారులు

6. పంజా విసిరి..చివరికి బందీ అయిన చిరుత

నల్గొండ జిల్లాలో చిరుత కలకలం రేపింది. మర్రిగూడ మండలం రాజిపేట తండా వద్ద చిరుత ముళ్లకంచెలో చిక్కుకుంది. గ్రామస్థుల సమాచారం మేరకు రంగంలోకి దిగిన అటవీశాఖ సిబ్బంది ముళ్ల కంచె నుంచి చిరుతను తప్పించే ప్రయత్నం చేశారు.  ఈక్రమంలో అటవీశాఖ సిబ్బందిపై చిరుత పులి దాడి చేసింది. ఈఘటనలో ఇద్దరు అటవీశాఖ సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయి. అయినా, ధైర్యంగా ఆపరేషన్‌ కొనసాగించిన అటవీశాఖ సిబ్బంది ఎట్టకేలకు చిరుతను బోనులో బంధించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ‘అందుకే కరోనా బారిన పడ్డాను’

తన అజాగ్రత్త వల్లే కరోనా వైరస్‌ బారిన పడినట్లు మహారాష్ట్ర మంత్రి జితేంద్ర అవద్‌ అన్నారు. కొన్ని రోజులు వెంటిలేటర్ పై చికిత్స పొందినట్లు చెప్పారు. ప్రస్తుతం ఆయన కొవిడ్ 19 నుంచి కోలుకొని ఆరోగ్యంగా ఉన్నారు. ‘కరోనా బారిన పడటానికి నా అజాగ్రత్తే కారణం. నేను నిపుణులు చెప్పిన విషయాలను సీరియస్‌గా తీసుకోలేదనుకుంటా. అందుకే నేను కరోనా ట్రాప్‌లో పడ్డాను’ అని ఓ ఆన్‌లైన్‌ సమావేశంలో మంత్రి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కరోనా ప్రారంభ దశలో థానే జిల్లాలో సహాయ కార్యక్రమాల నిమిత్తం ఆయన పర్యటించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. వధూవరులతో సహా 100 మంది క్వారెంటైన్‌

పెళ్లైన కొద్ది గంటల్లోనే వధూవరులతో సహా సుమారు 100 మంది బంధుమిత్రులను క్వారెంటైన్‌కు తరలించిన ఘటన మధ్యప్రదేశ్‌లోని ఛింద్వారా జిల్లాలో మంగళవారం చోటుచేసుకుంది. వధువు బంధువుకు కరోనా వైరస్‌ సోకినట్లు నిర్ధారణ కావడంతోనే వారిని ప్రభుత్వ క్వారెంటైన్‌ కేంద్రాలకు తరలించామని జిల్లా అధికారి వెల్లడించారు. వివరాల్లోకెళితే.. వధువు బంధువు ఒకరు సెంట్రల్‌ ఇండిస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌(సీఐఎస్‌ఎఫ్‌)లో విధులు నిర్వర్తిస్తున్నారు. గతవారం ఆయన ఛింద్వారా జిల్లాలోని జున్నార్దియోలో ఉన్న తన ఇంటికి వెళ్లారు. ఈ క్రమంలో అతను జిల్లా సరిహద్దుల్లో ప్రవేశిస్తుండగా అధికారులు స్క్రీనింగ్‌ పరీక్షలు జరిపి అనుమతించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ధోనీపై అవన్నీ పుకార్లే..!

టీమ్‌ఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్‌ ధోనీ రిటైర్మెంట్‌పై సామాజిక మాధ్యమాల్లో మరోసారి వార్తలు గుప్పుమన్నాయి. బుధవారం సాయంత్రం #DhoniRetires అనే హ్యాష్‌టాగ్ ట్విటర్‌లో ట్రెండింగ్‌గా మారడంతో ఆయన సతీమణి సాక్షి స్పందించారు. బుధవారం అర్ధరాత్రి వేళ ఆమె ఈ విషయంపై స్పష్టతనిస్తూ ఓ ట్వీట్‌ చేశారు. అవన్నీ పుకార్లేనని కొట్టిపారేశారు. ‘ఈ లాక్‌డౌన్‌తో పుకార్లు ప్రచారం చేసే వారి మానసికస్థితి దెబ్బతినిందని అర్థం చేసుకుంటా’ అని ట్వీట్‌ చేశారు. కాగా, సాక్షి ఈ పోస్టు చేసిన కొద్దిసేపటికే మళ్లీ తొలగించడం గమనార్హం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. హైకోర్టుకు హాజరైన ఏపీ సీఎస్‌ 

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ కార్యాలయాలకు వైకాపా జెండాను పోలిన రంగులు వేయడంపై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. ఏపీ సీఎస్‌ నీలం సాహ్ని, పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి జి.కె.ద్వివేది, పంచాయతీరాజ్‌ కమిషనర్‌ గిరిజాశంకర్‌ హాజరయ్యారు. ఇదే అంశానికి సంబంధించిన పిటిషన్‌ సుప్రీంకోర్టులో ఉన్నందున విచారణ రేపటికి వాయిదా వేస్తున్నట్టు హైకోర్టు తెలిపింది. పంచాయతీ కార్యాలయాలకు పార్టీ రంగులు వేయడంపై గుంటూరుకు చెందిన సామాజిక కార్యకర్త గతంలో హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.