close
Array ( ) 1

తాజా వార్తలు

Updated : 30/05/2020 13:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్ @ 1 PM

1. 90శాతం హామీలు అమలు చేశాం: జగన్‌

‘నవరత్నాల’ ద్వారానే పేదల జీవితాల్లో మార్పు వస్తుందని ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 10,641 రైతు భరోసా కేంద్రాలను తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి ఆన్‌లైన్‌ ద్వారా సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఏడాది పాలన ఎంతో నిబద్ధతతో సాగిందని, 90 శాతం హమీలు అమలు చేసే దిశగా అడుగులు వేశామని తెలిపారు. ఇచ్చిన మాటను, ప్రమాణాలను ఏడాదికాలంగా అమలు చేస్తున్నామన్నారు. ఇచ్చిన హామీలు 129 కాగా.. అమలు చేసినవి 77 ఉన్నాయని వివరించారు. అమలు కోసం మరో 35 హామీలు సిద్ధంగా ఉన్నాయని సీఎం తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ‘భూములిచ్చిన రైతులకు లాఠీ దెబ్బలా?’

రాజధానికోసం భూములు ఇచ్చిన రైతులు లాఠీ దెబ్బలు తిన్న ఘటన దేశ చరిత్రలోనే లేదని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. వైకాపా ఏడాది పాలనపై ట్విటర్‌ వేదికగా విమర్శనాస్త్రాలు సంధించారు. అవివేక నిర్ణయాలతో నమ్మిన ప్రజలనే జగన్‌ నట్టేట ముంచారని మండిపడ్డారు. రైతులు, పేదలు, మహిళలు, రైతు కూలీలు, భవన నిర్మాణ కార్మికులు, యువత... ఇలా అన్ని వర్గాల ప్రజలను రోడ్డెక్కించారని ధ్వజమెత్తారు. కొత్త ప్రభుత్వం, అనుభవం లేని ముఖ్యమంత్రి కాబట్టి ఆరు నెలల వరకు ప్రభుత్వానికి సహకరించాలని అనుకున్నా.. తొలి రోజు నుంచే అరాచకాలు మొదలుపెట్టారని దుయ్యబట్టారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. మరోసారి పేలిన స్పేస్‌ఎక్స్‌ రాకెట్‌

భవిష్యత్తులో చంద్రుడు, అంగారకుడిపైకి మనుషుల్ని పంపడమే లక్ష్యంగా స్పేస్‌ ఎక్స్‌ సంస్థ చేపట్టిన ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇందుకోసం రూపొందిస్తున్న భారీ రాకెట్‌ స్టార్‌షిప్‌(నమూనా) ప్రయోగం మరోసారి విఫలమైంది. ఇలా జరగడం ఇది నాలుగోసారి. శుక్రవారం భారీ ఏర్పాట్ల మధ్య టెక్సాస్‌లోని సంస్థ ప్రయోగ కేంద్రంలో రాకెట్‌ను ప్రయోగించేందుకు ఇంజిన్‌ను మండించగా.. అది నేలపై ఉండగానే పేలిపోయింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. మీ త్యాగాలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు: షా

2019లో రెండోసారి గద్దెనెక్కిన ఎన్డీఏ సర్కారు శనివారం ఏడాది పాలనను పూర్తి చేసుకున్న తరుణంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా భాజపా కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలియజేశారు. గత ఆరు సంవత్సరాలుగా ప్రభుత్వం సాధించిన విజయాలు, సంక్షేమ పథకాలను వారు ప్రతి ఇంటికి చేరవేసే పనిలో ఉన్నారని ట్విటర్ వేదికగా ప్రశంసించారు. ‘ఈ చరిత్రాత్మకమైన రోజున కోట్ల సంఖ్యలో ఉన్న భాజపా కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. గత ఆరు సంవత్సరాలుగా మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలను, ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికీ చేరేలా చూస్తున్నారు’ అని అభినందించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఎన్డీయే-2 ఏడాది పాలనపై ప్రత్యేక కథనం

6. కరోనా మృతదేహం బ్యాగ్‌ తెరవడంతో..

కరోనా మహమ్మారి ఎంత ప్రమాదకరమైందో అందరికీ తెలిసిందే. దేశంలో రోజురోజుకూ పాజిటివ్‌ కేసులు పెరిగిపోతున్నా పలువురు మాత్రం ఇంకా నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు. అందుకు ఉదాహరణే తాజాగా మహారాష్ట్రలోని థానేలో చోటుచేసుకున్న ఈ ఘటన. 40 ఏళ్ల ఓ మహిళ ఇటీవల కరోనా వైరస్‌ లక్షణాలతో మృతిచెందింది. వైద్యులు ఆమె మృతదేహాన్ని ప్యాక్‌చేసి బంధువులకు అప్పగించారు. దాన్ని తెరవకుండా నేరుగా అంత్యక్రియలు నిర్వహించాలని ఆదేశించినా వారు పెడచెవిన పెట్టారు. అంతిమ సంస్కారాల్లో ఆమె మృతదేహం ప్యాక్‌ చేసిన బ్యాగ్‌ను తెరవడంతో బంధువుల్లో 18 మందికి వైరస్‌ సోకింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. వలసకూలీలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు

దేశంలో కరోనా సంక్షోభంతో నెలకొన్న పరిస్థితుల వల్ల వలసకూలీలు, కార్మికులు సహా ఇతర వర్గాలకు చెందిన వారు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని ప్రధాని మోదీ గుర్తుచేశారు. అయితే, ఈ సమస్యలు విపత్తులుగా రూపాంతరం చెందకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని గుర్తుచేశారు. రెండో దఫా అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా రాసిన బహిరంగ లేఖలో మోదీ కరోనా సంక్షోభ పరిస్థితులు, ప్రజల ఇబ్బందులు, ప్రభుత్వం తీసుకున్న చర్యల్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. లైవ్ బ్లాగ్‌ కోసం క్లిక్‌ చేయండి

8. ‘గ్లోబల్‌ లీడర్‌’ కల సాకారం దిశగా..

భారత్‌ను ‘గ్లోబల్‌ లీడర్‌’గా మార్చాలన్న కలను సాకారం చేసే దిశగా తమ తొలి ఏడాది పాలన సాగిందని ప్రధాని మోదీ అన్నారు. ఈ సంవత్సర కాలంలో తన ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమాలు, సాధించిన విజయాలను గుర్తుచేశారు. 2019 ఎన్నికల్లో భారీ మెజారిటీతో రెండోసారి గద్దెనెక్కి నేటితో ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ఆయన బహిరంగ లేఖ రాశారు. అధికరణ 370 రద్దు ప్రజల్లో ఏకత్వాన్ని, దేశ సమగ్రతను చాటిందని మోదీ తెలిపారు. శతాబ్దాలుగా పరిష్కారం దొరకని అయోధ్య రామమందిర వివాదం తన పాలనాకాలంలోనే సుప్రీంకోర్టు తీర్పుతో సద్దుమణగడం సంతోషంగా ఉందన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. భారత్‌లో 24 గంటల్లో 7964 కొత్త కేసులు

దేశంలో కరోనా తీవ్రరూపం దాలుస్తోంది. గత 24 గంటల్లో 7964 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు ఒక్కరోజు వ్యవధిలో నిర్ధారణ అయిన కేసుల్లో ఇదే అత్యధికం. ఏడు వేలకు పైగా కేసులు నమోదు కావడం వరుసగా ఇది రెండో రోజు కావడం గమనార్హం. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,73,763కు పెరిగింది. ఇక కొత్తగా మరో 265 మంది మృతిచెందడంతో మృతుల సంఖ్య 4,971కి చేరింది. ఇక 82,369 మంది కోలుకొని ఇళ్లకు చేరగా.. మరో 86,422 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గడిచిన 24 గంటల్లోనే 11,264 మంది కోలుకోవడం ఊరట కలిగిస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. నిమ్మగడ్డ అంశంపై సుప్రీంకోర్టులో కేవియట్‌

నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ అంశంపై సుప్రీంకోర్టులో కేవియట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా రమేశ్‌కుమార్‌ను తిరిగి నియమించాలని నిన్న ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే, హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళతామని వైకాపా ఎమ్మెల్యేలు  ప్రకటించారు. ఈనేపథ్యంలో హైకోర్టు తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం స్టే పొందకుండా ముందస్తు చర్యగా కేవియట్‌ పిటిషన్‌ వేశారు. గుంటూరుకు చెందిన కాంగ్రెస్‌ నేత మస్తాన్‌వలీ తరఫున న్యాయవాది నర్రా శ్రీనివాసరావు ఈ పిటిషన్ దాఖలు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.