close
Array ( ) 1

తాజా వార్తలు

Updated : 14/07/2020 13:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ @ 1 PM

1. గాంధీలో పొరుగుసేవల సిబ్బంది ఆందోళన

వేతనాల పెంపు, ఉద్యోగాల క్రమబద్దీకరణ సహా సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సికింద్రాబాద్‌ గాంధీ ఆసుపత్రి పొరుగుసేవల సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, సెక్యూరిటీ సిబ్బంది విధులు బహిష్కరించి ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. వివిధ విభాగాల్లో పనిచేస్తున్న పొరుగుసేవల సిబ్బంది మొత్తం జేఏసీగా ఏర్పడి ధర్నా నిర్వహిస్తున్నారు. నర్సులు, ఇతర సిబ్బంది విధులు బహిష్కరించి రోడ్డుపై బైఠాయించడంతో గాంధీఆసుపత్రిలో వైద్య సేవలు నిలిచిపోయి రోగులు ఇబ్బంది పడుతున్నారు. సమస్యలు పరిష్కరించాలని ఐదు రోజులుగా ధర్నా చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని పొరుగుసేవల సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. తిరుమలలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

శ్రీవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం కార్యక్రమాన్ని తితిదే వైభవంగా నిర్వహించింది. ఈనెల 16న ఆణివార ఆస్థానంను పురస్కరించుకుని ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని చేపట్టారు. వేకువజామున స్వామివారికి సుప్రభాతం, అర్చన సేవల అనంతరం శ్రీవారి మూలవిరాట్‌పై పట్టు వస్త్రంతో అర్చకులు పూర్తిగా కప్పివేశారు. నాముకోపు, శ్రీ చుర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కిచిలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలిపిన పవిత్ర జలంతో ప్రదక్షణగా వచ్చి ఆలయ శద్ధి కార్యక్రమం నిర్వహించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. బోడుప్పల్‌లో కార్పొరేటర్‌ దౌర్జన్యం

అధికార పార్టీ కార్పొరేటర్‌ భూ వివాదంలో తలదూర్చడమే కాకుండా ప్రశ్నించినందుకు తన భర్తపై అనుచరులతో కలిసి దాడి చేశారని ఓ మహిళ రాష్ట్ర మానవహక్కుల కమిషన్‌ను ఆశ్రయించింది. మేడ్చల్‌ జిల్లా బోడుప్పల్‌ ద్వారకానగర్‌లో ఆరేళ్ల క్రితం బ్యాంకు ద్వారా ఇంటిని కొనుగోలు చేశామని, అందులో తనకు వాటా కావాలని స్థానిక కార్పొరేటర్‌ తమ ఇంటికి వచ్చి దౌర్జన్యానికి పాల్పడ్డారని కమిషన్‌కు వివరించింది. ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం జరగ్గా.. కార్పొరేటర్‌, అతని అనుచరులు తన భర్త పురేందర్‌రెడ్డిపై విచక్షణారహితంగా దాడి చేశారని వాపోయారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. బెంగళూరులో నేటినుంచి మళ్లీ లాక్‌డౌన్‌!

దేశంలో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా మహానగరాల్లో దీని తీవ్రత ఎక్కువగా ఉంది. తాజాగా కర్ణాటకలో వైరస్‌ ఉద్ధృతి ఒక్కసారిగా పెరిగింది. నిన్న ఒక్కరోజే రాష్ట్రంలో 2738పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. దీంతో అప్రమత్తమైన కర్ణాటక ప్రభుత్వం రాజధాని బెంగళూరుతోపాటు పలు జిల్లాల్లో వారంపాటు పూర్తి లాక్‌డౌన్‌ ప్రకటించింది. నేటి సాయంత్రం(జులై 14) నుంచి జులై 22వరకు సంపూర్ణ లాక్‌డౌన్‌ కొనసాగుతుందని వెల్లడించింది. అయితే అత్యవసర సేవలు, కిరాణ దుకాణాలతోపాటు మరికొన్నింటికి లాక్‌డౌన్‌ నుంచి మినహాయించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. రూపురేఖల్లోనే కాదు.. మార్కుల్లోనూ కవలలే

కవలలు అంటే సాధారణంగా మనకు గుర్తొచ్చేది ఒకే రూపురేఖలు. తరచూ చూసేవారు కూడా కాస్త పరిశీలించి చూస్తేగానీ గుర్తుపట్టలేరు. ఇక ఒకే రకం డ్రెస్‌ వేసుకుంటే దగ్గరి బంధువులు గుర్తుపట్టడం కూడా కాస్త కష్టమే. అంతలా వారి రూపురేఖలు కలిసిపోతాయి. ఇవన్నీ మనకు తెలిసినవే. కానీ, నోయిడాకు చెందిన కవలలు మాత్రం వీటన్నింటితో పాటు మార్కులు కూడా ఒకేలా సాధించారు. అదీ ప్రతి సబ్జెక్టులోనూ ఒకే రకం మార్కులు. వివరాల్లోకి వెళితే.. నోయిడాకు చెందిన మానసి, మాన్య మార్చి 3, 2003న జన్మించారు. ఇద్దరి పుట్టుకకు మధ్య తొమ్మిది నిమిషాల వ్యవధి అని కుటుంబ సభ్యులు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. నా వల్లకావడంలేదు..: బోల్సెనారో

తిట్టే నోరు, తిరిగే కాలు ఊరకుండవు అన్నట్లుంది బ్రెజిల్‌ అధ్యక్షుడు జైర్‌ బోల్సెనారోను చూస్తే. దేశాధ్యక్షుడి హోదాలో నిత్యం వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటూ.. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో ఉండే ఆయనకు ఇప్పుడు కొవిడ్‌ ఐసోలేషన్‌లో ఉండటం చిరాగ్గా ఉంది. దీంతో మరోసారి కొవిడ్‌ టెస్ట్‌‌ చేయించుకోవాలని సోమవారం నిర్ణయించుకొన్నారు. దీనిపై ఇటీవల సీఎన్‌ఎన్‌ బ్రెజిల్‌ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన స్పందించారు. ‘‘నేను ఐసోలేషన్‌లో ఉండలేకపోతున్నాను. మంగళవారం మరోసారి కరోనా పరీక్ష ఉంది. దానికి మరికొన్ని గంటలే సమయం ఉంది. నేను చాలా ఆతృతతో ఎదురు చూస్తున్నాను. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. ‘స్థిరత్వం పేరిట ఉద్రిక్తతలు సృష్టించొద్దు’

పొరుగు దేశాలపై చైనా దౌర్జన్యానికి, బెదిరింపులకు పాల్పడుతోందన్న అమెరికా ప్రకటనను డ్రాగన్ తప్పుబట్టింది. అలాగే దక్షిణ చైనా సముద్రంలో చైనా అధికారాల్ని అమెరికా వ్యతిరేకించడం తగదని వ్యాఖ్యానించింది. ఈ మేరకు అమెరికాలోని చైనా రాయబార కార్యాలయం మంగళవారం ప్రకటన విడుదల చేసింది. ఇతర దేశాల సార్వభౌమత్వానికి సంబంధించిన విషయాల్లో తలదూర్చొద్దన్న నిబంధనకు కట్టుబడి ఉండాలని హితవు పలికింది.  దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలో శాంతి స్థాపనకు ఎలాంటి అడ్డంకులు సృష్టించొద్దని పేర్కొంది. స్థిరత్వం పేరిట ఈ ప్రాంతంలో ఉద్రిక్తలు సృష్టించేందుకు.. తన బలాన్ని ప్రదర్శించేందుకు అమెరికా ప్రయత్నిస్తోందని ఆరోపించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. భారత్‌: 9 లక్షలు దాటిన కరోనా కేసులు!

భారత్‌లో కరోనా వైరస్‌ మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. గతకొన్ని రోజులుగా రికార్డుస్థాయిలో నిత్యం దాదాపు 28వేల పాజిటివ్‌ కేసులు బయటపడుతున్నాయి. తాజాగా గడిచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 28,498 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కొవిడ్‌ సోకిన వారిసంఖ్య 9,06,752కు చేరినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. నిన్న ఒక్కరోజే 553 మంది కొవిడ్‌ బాధితులు మృతి చెందారు. దీంతో భారత్‌లో కరోనా మృతుల సంఖ్య 23,727గా నమోదైనట్లు ప్రభుత్వం తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. ఆ రెండు కంపెనీల ఫోన్లతో ఛార్జర్స్‌ రావు!

స్మార్ట్‌ఫోన్ లేదా సాధారణంగా ఏ ఫోన్‌ కొనుగోలు చేసినా.. ఛార్జర్‌ తప్పనిసరిగా వినియోగదారుడికి అందించేవి పలు సంస్థలు. అయితే ఇక నుంచి ఆ రెండు కంపెనీల నుంచి వచ్చే ఫోన్లతోపాటు ఛార్జింగ్‌ కేబుల్‌ కాని.. బ్లాక్‌ కాని వచ్చే అవకాశం లేదని ఊహాగానాలు వస్తున్నాయి. యాపిల్‌ తన తర్వాత మోడల్‌ ఐఫోన్‌ 12, శామ్‌సంగ్ తన గెలాక్సీ ఎస్‌30 ఫోన్లతో ఛార్జర్లను అందించడం లేదనే వార్తలు లీకయ్యాయి. దీంతో ఛార్జర్‌ను ప్రత్యేకంగా కొనుగోలు చేయమని లేదా ఇప్పటికే ఇంట్లో అలాంటి ఏదైనా డివైస్‌ ఉంటే వాడుకోమని సూచించనుంది. అయితే ఇది సరైన నిర్ణయంగా పలువురు నిపుణులు అభిప్రాయడుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. సచిన్‌ పైలట్‌ మళ్లీ డుమ్మా!

ఉపముఖ్యమంత్రి సచిన్‌ పైలట్‌ తిరుగుబాటుతో తలెత్తిన రాజకీయ సంక్షోభం నేపథ్యంలో నేడు కాంగ్రెస్‌ శాసనసభాపక్షం రెండోసారి సమావేశమయ్యింది. ప్రస్తుతం గహ్లోత్‌ వర్గం బస చేస్తున్న జైపుర్‌లోని ఫెయిర్‌మోంట్‌ హాటల్‌లో ఈ భేటీ ప్రారంభమయింది. ఊహించినట్లే సచిన్‌ పైలట్‌ మరోసారి ఈ సమావేశానికి డుమ్మా కొట్టారు. సమావేశానికి ముందు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, అహ్మద్‌ పటేల్‌, చిదంబరం, కె.సి.వేణుగోపాల్‌ పలుసార్లు సచిన్‌ పైలట్‌తో మాట్లాడినట్లు పార్టీకి చెందిన కొంతమంది నాయకులు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.