టాప్‌ 10 న్యూస్ @ 1 PM
close

తాజా వార్తలు

Published : 29/03/2020 13:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

టాప్‌ 10 న్యూస్ @ 1 PM

1. చంద్రబాబు నివాసంలో తెదేపా ఆవిర్భావ వేడుకలు

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో తెదేపా జెండా ఎగురవేశారు. ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో పార్టీ ఆవిర్భావ వేడుకలను నిరాడంబరంగా జరుపుకొన్నారు. కార్యక్రమంలో  తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ తదితరులు పాల్గొన్నారు. కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో పార్టీ నేతలు, కార్యకర్తలు ఇళ్లపైనే తెదేపా జెండాలు ఎగురవేయాలని చంద్రబాబు సూచించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. మీ రక్షణ కోసమే లాక్‌డౌన్‌ : మోదీ

తప్పని పరిస్థితుల్లోనే దేశంలో లాక్‌డౌన్‌ విధించాల్సి వచ్చిందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఆంక్షల వల్ల సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని అందుకు తనని క్షమించాలని వేడుకున్నారు. ముఖ్యంగా దినసరి కూలీలు పడుతున్న బాధల్ని తాను అర్థం చేసుకోగలనని వ్యాఖ్యానించారు. ప్రజలు తమని తాము రక్షించుకుంటూ.. తమ కుటుంబాల్ని కూడా కాపాడుకోవడానికే లాక్‌డౌన్‌ విధించామన్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ సృష్టిస్తున్న విలయతాండవం నేపథ్యంలోనే కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. భారత్‌లో 25కు పెరిగిన మృతుల సంఖ్య

భారత్‌లో కరోనా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. ఆదివారం ఉదయానికి కరోనా సోకిన వారి సంఖ్య 979కి చేరింది. వీరిలో 25 మంది మృత్యువాతపడ్డారు. తాజాగా జమ్మూకశ్మీర్‌, గుజరాత్‌లో ఒక్కరు చొప్పున మరణించారు. దీంతో మృతుల సంఖ్య జమ్ముకశ్మీర్‌లో రెండుకు, గుజరాత్‌లో ఐదుకు పెరిగింది. అలాగే మహారాష్ట్రలో కొత్తగా మరో 12 కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో అక్కడ బాధితుల సంఖ్య 193కు పెరిగింది. మధ్యప్రదేశ్‌లోనూ కొత్తగా ఐదుగురికి వైరస్‌ సోకినట్లు నిర్ధారించడంతో రాష్ట్రంలో బాధితుల సంఖ్య 39కి చేరింది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 86 మంది కోలుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. తెలుగుయాత్రీకులను ఆదుకోవాలి: లోకేశ్‌ 

దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ నేపథ్యంలో వారణాసిలో చిక్కుకున్న తెలుగు యాత్రీకులను కాపాడాలని  తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ కోరారు. తీర్థయాత్రలకు వెళ్లిన 34 మంది వారణాసిలో చిక్కుకున్నారని లోకేశ్‌ ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. యాత్రీకులకు సహాయం అందించాలని ఉత్తర్‌ప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను కోరారు. ప్రస్తుతం వారణాసిలో ఉన్న తెలుగువారి వివరాలు, ఫోన్‌ నంబర్లను ట్విటర్‌లో పోస్టు చేశారు. వారంతా వారణాసిలోని నటరాజన్‌ హోటల్‌లో సహాయం కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. లైవ్‌ బ్లాగ్‌ కోసం క్లిక్‌ చేయండి

5. తిహాడ్‌ నుంచి 400 మంది ఖైదీలు విడుదల!

కరోనా వైరస్‌ తీవ్రత దృష్ట్యా తిహాడ్‌ జైలులోని 419 మంది ఖైదీలను శనివారం విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. వీరిలో 356 మందిని 45 రోజుల మధ్యంతర బెయిల్‌పై, మరో 63 మందిని ఎనిమిది వారాల అత్యవసర పెరోల్‌పై విడుదల చేసినట్లు వెల్లడించారు. కరోనా వైరస్‌ వ్యాప్తి తీవ్ర భయాందోళనలు కలిగిస్తున్న నేపథ్యంలో జైళ్లలో రద్దీ తగ్గించడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు జైలు వర్గాలు తెలిపాయి. మొత్తం 3000 మంది ఖైదీలను విడుదల చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా తొలి విడతలో శనివారం 419 మందిని విడుదల చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. కోలుకున్న కెనడా ప్రధాని భార్య

కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో సతీమణి సోఫీ గ్రెగొరీ కరోనా వైరస్ బారి నుంచి కోలుకున్నారు. ఈ మేరకు వైద్యుల నుంచి ధ్రువీకరణ కూడా వచ్చిందని ఆమె తన సామాజిక మాధ్యమ ఖాతాల్లో వెల్లడించారు. ఆమెకు వైరస్‌ సోకినట్లు మార్చి 12న నిర్ధారణ అయ్యింది. దీంతో అప్పటి నుంచి ఆమె స్వీయ నిర్బంధంలో ఉన్నారు. ఆమెతో పాటు ప్రధాని ట్రూడో వారి పిల్లలు కూడా ఇంటికే పరిమితమయ్యారు. ట్రూడో ఇంత కాలం ఇంటి నుంచే విధులు నిర్వర్తించారు. తన భార్య కోలుకున్న సందర్భంగా ట్రూడో తన సిబ్బంది, వైద్యులకు ధన్యవాదాలు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. చైనాలో 3,300 దాటిన మరణాలు..!

చైనాలో కరోనా మహమ్మారి శాంతించినట్లే కనిపిస్తున్నా కేసులు సంఖ్య పెరుగుదల కనిపిస్తోంది. తాజాగా చైనాలో మరో 45 కేసులు నమోదయ్యాయి. దీనిలో స్థానికంగా సామాజిక వ్యాప్తి నుంచి వచ్చిన కేసు ఒకటి ఉంది. మిగిలిన 44 కేసులు విదేశీ ప్రయాణాలు చేసి వచ్చినవారివి. ఇక మరణాలు కూడా 3,300ల మార్కును చేరాయి. ఈ విషయాన్ని చైనా అధికారులు ఆదివారం ప్రకటించారు. హెనాన్‌ ప్రావిన్స్‌లో సామాజిక వ్యాప్తికి సంబంధించిన కేసు నమోదైనట్లు నేషనల్‌ హెల్త్‌ కమిషన్‌ పేర్కొంది. మరో ఐదు మరణాలు కూడా సంభవించాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. దేశం ముందు క్రికెట్‌ చాలా చిన్నది

దేశం ముందు క్రికెట్‌ చాలా చిన్నదని, ప్రస్తుత పరిస్థితుల్లో తాను క్రికెట్‌ గురించి ఆలోచించట్లేదని టీమ్‌ఇండియా సీనియర్‌ స్పిన్నర్‌ హర్భజన్‌సింగ్‌ అన్నాడు. ‘నిజంగా ఇప్పుడు నేను క్రికెట్‌ గురించి ఆలోచించట్లేదు. గత 15 రోజులుగా దాని ధ్యాసేలేదు. దేశం ముందు అది చాలా చిన్నది. ఒకవేళ ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో నేను క్రికెట్‌ గురించి లేదా ఐపీఎల్‌ గురించి ఆలోచిస్తే స్వార్థపరుడిని అవుతా. సంపూర్ణ ఆరోగ్య భారత దేశమే ఇప్పుడు మన ప్రధాన కర్తవ్యం. మనమంతా ఆరోగ్యంగా, జాగ్రత్తగా ఉంటేనే క్రీడలు జరుగుతాయి. ఇప్పుడైతే క్రికెట్‌ నా ఆలోచనల్లో కూడా లేదు’ అని భజ్జీ అన్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. రేపటి నుంచి మహీంద్రా ఫేస్‌షీల్డ్‌ తయారీ..

కరోనావైరస్‌పై పోరుకు మహీంద్రా అండ్‌ మహీంద్రా సంస్థ చురుగ్గా సిద్ధమవుతోంది. ఇప్పటికే అత్యంత చౌకగా వెంటిలేటర్ల ఉత్పత్తిపై దృష్టిపెట్టిన ఈ సంస్థ తాజాగా ఫేస్‌ షీల్డ్‌ల తయారీని ప్రారంభిస్తోంది. రేపటి నుంచి మహీంద్రా ఫేస్‌ షీల్డ్‌ల తయారీ ప్రారంభమవుతుందని సంస్థ ఎండీ పవన్‌ గోయంకా వెల్లడించారు. ‘‘మా భాగస్వామి ఫోర్డ్‌ మోటార్‌ నుంచి డిజైన్‌ తీసుకొన్నాము. మేము ఫేస్‌షీల్డ్‌ తయారీకి సిద్ధంగా ఉన్నాము. సోమవారం నుంచి 500 యూనిట్ల తయారీతో ఉత్పత్తిని ప్రారంభిస్తాము’’ అని పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. పామును మింగేందుకు మరో పాము ప్రయత్నం



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని