close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్ @ 1 PM

1. ఎన్‌కౌంటర్‌పై సుప్రీం విచారణ కమిషన్‌

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్య కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌పై దర్యాప్తు జరిపేందుకు సర్వోన్నత న్యాయస్థానం ముగ్గురు సభ్యులతో విచారణ కమిషన్‌ ఏర్పాటుచేసింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి వీఎస్‌ సిర్పూర్కర్‌ నేతృత్వంలోని ఈ కమిషన్‌ ఆరు నెలల్లోగా విచారణ పూర్తి చేయాలని ఆదేశించింది. బాంబే హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ రేఖ, సీబీఐ మాజీ డైరెక్టర్‌ కార్తికేయన్‌ ఈ ప్యానెల్‌లో సభ్యులుగా ఉంటారని తెలిపింది. అంతేగాక, ఈ కేసులో సుప్రీంకోర్టు తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంతవరకు ఇతర కోర్టులు గానీ, అథారిటీలు గానీ విచారణ జరపరాదని స్పష్టం చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. మేము వాలంటీర్లుగా పనిచేస్తాం

నిర్భయ దోషులను త్వరలో తీహార్‌ జైలులో ఉరి తీయనున్నారన్న వార్తలు వస్తున్న  నేపథ్యంలో తీహార్‌ జైలుకు లేఖల పరంపర పెరిగిపోయింది. దోషులను ఉరి తీసే సమయంలో వాలంటీర్లుగా పనిచేస్తామంటూ దాదాపు 15 మంది జైలుకు లేఖలు పంపారు. ఈ లేఖల్లో రెండు లేఖలు విదేశాల నుంచి రావడం విశేషం. దిల్లీ, గురుగ్రామ్‌, ముంబై, చత్తీస్‌ఘడ్‌, కేరళ, తమిళనాడు నుంచి లేఖలు అందినట్లు జైలు అధికారులు తెలిపారు. ఒకరు లండన్‌ నుంచి లేఖ రాయాగా, మరొకరు అమెరికా నుంచి రాశారు. వారిలో ఒకరు న్యాయవాది కాగా.. మరొకరు ఛార్టెడ్‌ అకౌంటెంట్‌ కావడం విశేషం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. అసోం ప్రజలకు మోదీ హామీ

పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఈశాన్య రాష్ట్రమైన అసోంలో పెద్ద ఎత్తున నిరసన జ్వాలలు రేగిన నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పందించారు. క్యాబ్‌పై ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని, మీ హక్కులను ఎవరూ హరించలేరు.. అంటూ ట్విటర్‌ వేదికగా అసోం ప్రజలకు హామీ ఇచ్చారు. పొరుగు దేశాల్లో మతపరమైన పీడనకు గురై భారత్‌లో ఆశ్రయం కోరి వచ్చిన శరణార్థులకు పౌరసత్వం కల్పించే దిశగా ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ బిల్లుకు పార్లమెంట్‌ ఉభయ సభల్లోనూ ఆమోదం లభించిన విషయం తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. సుప్రీంకు చేరిన పౌరసత్వ బిల్లు వ్యవహారం

విపక్షాల అభ్యంతరాలు, ఆందోళనల నడుమ పార్లమెంట్ ఉభయ సభల్లో గట్టెక్కిన పౌరసత్వ సవరణ బిల్లు.. ఇప్పుడు సుప్రీంకోర్టులో న్యాయపరీక్షను ఎదుర్కోనుంది. ఈ బిల్లును వ్యతిరేకిస్తూ ఇండియన్‌ యూనియన్‌ ముస్లిం లీగ్‌(ఐయూఎంఎల్‌) నేడు సర్వోన్నత న్యాయస్థానంలో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ బిల్లు ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తోందని ఐయూఎంఎల్‌ పిటిషన్‌లో పేర్కొంది. ఇది రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించాలని న్యాయస్థానాన్ని కోరింది. ఐయూఎంల్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబాల్‌ వాదనలు వినిపించనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. అమిత్‌షా మా దేశంలో ఉంటే తెలుస్తుంది

జాతీయ పౌరసత్వ సవరణ బిల్లు ద్వారా లౌకికవాద దేశంగా ఉన్న భారత్‌ పేరు మసగబారే అవకాశం ఉందని బంగ్లాదేశ్‌ విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి ఏకే అబ్దుల్‌ మేనన్‌ పేర్కొన్నారు. ‘భారతదేశం లౌకికవాదాన్ని విశ్వసిస్తున్న దేశం. కానీ, ప్రస్తుతం తీసుకున్న నిర్ణయం కారణంగా చారిత్రాత్మకంగా అది బలహీనపడే అవకాశం ఉంది’అని ఆయన అన్నారు. పౌరసత్వ సవరణ బిల్లు విషయంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా తీరును విమర్శించారు. పీడనకు గురౌవుతున్న మైనార్టీ దేశాల జాబితాలో బంగ్లాదేశ్‌ను చేర్చడం పట్ల ఆయన అసహనం వ్యక్తం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. తాత్కాలిక డైరెక్టర్‌గా స్మిత్‌

దక్షిణాఫ్రికా మాజీ సారథి గ్రేమ్‌ స్మిత్‌ దక్షిణాఫ్రికా క్రికెట్‌ బోర్డు (సీఎస్‌ఏ) తాత్కాలిక డైరెక్టర్‌గా నియమితుడయ్యాడు. వచ్చే ఏడాది ఐపీఎల్‌ ముగిసేవరకు అతడు తన పదవిలో కొనసాగుతాడని సీఎస్‌ఏ సీఈవో జాక్వస్‌ ఫాల్ తెలిపారు. స్మిత్‌ ఈ బాధ్యతలను స్వీకరించడం సంతోషంగా ఉందని వెల్లడించారు. క్లిష్ట సమయాల్లో ఇలాంటి బాధ్యతలు అందుకొని దక్షిణాఫ్రికా క్రికెట్‌ను ముందుకు నడిపించడానికి ఎంతో ఇష్టపడతానని స్మిత్‌ పేర్కొన్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. భారీ ప్రీమియంతో మార్కెట్లోకి ఉజ్జీవన్‌

ఉజ్జీవన్‌ స్మాల్‌ఫైనాన్స్‌ బ్యాంక్‌ నేడు భారీ ప్రీమియంతో మార్కెట్లలో నమోదైంది. లిస్టింగ్‌సమయంలో ఈ షేరు ధర రూ.58గా పలికింది. అంటే ఐపీవోలో కేటాయించిన రేటు కంటే 57శాతం అధికమన్నమాట. ఇష్యూలో దీనిని రూ.37కు కేటాయించారు. ఒక దశలో ఈ షేరు రూ.62.08కి కూడా చేరింది. రూ.750 కోట్లను సమీకరించేందుకు ఐపీవోకు వచ్చిన ఈ సంస్థకు రూ.76వేల కోట్లకు బిడ్లు రావడం విశేషం. అంటే దాదాపు 160 రెట్లకు పైమాటే. 2018 నుంచి వచ్చిన అన్ని ఐపీవోల్లోకి ఇదే అత్యధికంగా బిడ్లను దక్కించుకొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. అత్యుత్తమ ఇన్నింగ్స్‌ ఇది: కోహ్లీ

నిర్ణయాత్మక టీ20లో వెస్టిండీస్‌పై భారత్‌ 67 పరుగుల తేడాతో విజయం సాధించింది. సారథి విరాట్ కోహ్లీ (70*, 29 బంతుల్లో; 4×4, 7×6) ఫోర్లు, సిక్సర్లతో హోరెత్తించాడు. తన కెరీర్‌లోనే ఇదో అత్యుత్తమ ఇన్నింగ్స్‌ అని మ్యాచ్‌ అనంతరం కోహ్లీ పేర్కొన్నాడు. ‘ఇది నాకు ఎంతో ప్రత్యేకమైన రోజు. నా అత్యుత్తమ ఇన్నింగ్స్‌లో ఇదొకటి. తొలుత బ్యాటింగ్‌ చేసి విజయం సాధించడం ఎంతో బాగుంది. అన్ని ఫార్మాట్లలో రాణించగలనని తెలుసు. మన ఆలోచన విధానంపై ఇది ఆధారపడి ఉంటుంది. ప్రపంచకప్‌కు ముందు ఈ మ్యాచ్‌ ఎంతో ప్రేరణగా నిలుస్తుంది’ అని అన్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ప్రకాశంలో రోడ్డు ప్రమాదం.. నలుగురి మృతి

ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలం కొత్తపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కారును ఎదురుగా వచ్చిన లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారులోని నలుగురు వ్యక్తులు మృతి చెందగా.. మరో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను పొదిలిలోని ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులను కర్ణాటకలోని బళ్లారి వాసులుగా గుర్తించారు. శ్రీశైలం ఆలయానికి వెళ్లి అక్కడి నుంచి తిరుపతి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. సచివాలయం వద్ద తెదేపా ఆందోళన


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.