
తాజా వార్తలు
ఫలక్‌నుమా సర్కిల్లో మజ్లిస్ క్లీన్‌స్వీప్
హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. పాతబస్తీలో ఎప్పటిలాగే ఈసారీ ఎంఐఎం తన హవా కొనసాగించింది. ఫలక్‌నుమా సర్కిల్లోని ఆరుస్థానాల్లోనూ పతంగి రెపరెపలాడింది. ఫలక్‌నుమా, నవాబ్‌సాహెబ్‌కుంట, దూద్‌బౌలి, జహానుమా, రాంనాస్త్పురా, కిషన్‌బాగ్‌లో మజ్లిస్ అభ్యర్థులు విజయం సాధించారు.
ఫలక్‌నుమాలో కె.తారాబాయి, నవాబ్‌సాహెబ్ కుంటలో షరీన్ ఖాటూన్, దూద్‌బౌలిలో మహ్మద్ సలీం, జహానుమాలో ఎండీ అబ్దుల్ ముఖ్తాదర్, రాంనాస్త్పురాలో మహ్మద్ ఖాదర్, కిషన్‌బాగ్‌లో ఖాజా ముబాషీరుద్దీన్ గెలుపొందారు. మరోవైపు చాంద్రాయణగుట్ట సర్కిల్లోనూ క్లీన్‌స్వీప్ దిశగా మజ్లిస్ దూసుకెళ్తోంది. ఇప్పటికే రియాసత్‌నగర్, కాంచన్‌బాగ్, బార్కాస్, చాంద్రాయణగుట్టలో ఆ పార్టీ విజయం సాధించింది. ఆ సర్కిల్లోని లలితాబాగ్, ఉప్పుగూడ, జంగమ్మెట్ డివిజన్లలో ఇంకా తుది ఫలితం వెల్లడికావాల్సింది.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- ఆప్త నేస్తాలు.. ఆఖరి మజిలీ!
- ‘నా మృతదేహాన్ని వాటికి ఆహారంగా వేయండి’
- క్షమించు నాన్నా..నిను వదిలి వెళ్తున్నా!
- కంగారూను పట్టలేక..
- రెరా మధ్యే మార్గం
- చరిత్ర సృష్టించిన నయా యార్కర్ కింగ్
- ఇన్‌కాగ్నిటో నిజంగా పనిచేస్తుందా?
- ఒంటెను ఢీకొని బెంగళూరు ఫేమస్ బైకర్ మృతి
- అభిమానుల దుశ్చర్య:సిరాజ్‌పై వ్యాఖ్యలు
- గబ్బా టెస్టు: ఆసీస్ తొలి ఇన్నింగ్స్ 369
ఎక్కువ మంది చదివినవి (Most Read)
