close

తాజా వార్తలు

Published : 04/12/2020 16:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఫలక్‌నుమా సర్కిల్‌లో మజ్లిస్‌ క్లీన్‌స్వీప్‌

హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ  ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. పాతబస్తీలో ఎప్పటిలాగే ఈసారీ ఎంఐఎం తన హవా కొనసాగించింది. ఫలక్‌నుమా సర్కిల్‌లోని ఆరుస్థానాల్లోనూ పతంగి రెపరెపలాడింది. ఫలక్‌నుమా, నవాబ్‌సాహెబ్‌కుంట, దూద్‌బౌలి, జహానుమా, రాంనాస్త్‌పురా, కిషన్‌బాగ్‌లో మజ్లిస్‌ అభ్యర్థులు విజయం సాధించారు.

ఫలక్‌నుమాలో కె.తారాబాయి, నవాబ్‌సాహెబ్‌ కుంటలో షరీన్‌ ఖాటూన్‌, దూద్‌బౌలిలో మహ్మద్‌ సలీం, జహానుమాలో ఎండీ అబ్దుల్‌ ముఖ్తాదర్‌, రాంనాస్త్‌పురాలో మహ్మద్‌ ఖాదర్‌, కిషన్‌బాగ్‌లో ఖాజా ముబాషీరుద్దీన్‌ గెలుపొందారు. మరోవైపు చాంద్రాయణగుట్ట సర్కిల్‌లోనూ క్లీన్‌స్వీప్‌ దిశగా మజ్లిస్‌ దూసుకెళ్తోంది. ఇప్పటికే రియాసత్‌నగర్‌, కాంచన్‌బాగ్‌, బార్కాస్‌, చాంద్రాయణగుట్టలో ఆ పార్టీ విజయం సాధించింది. ఆ సర్కిల్‌లోని లలితాబాగ్‌, ఉప్పుగూడ, జంగమ్మెట్‌ డివిజన్లలో ఇంకా తుది ఫలితం వెల్లడికావాల్సింది.



Tags :
జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని