close
Array ( ) 1

తాజా వార్తలు

20 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

అమరావతి: త్వరలో ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది. సమావేశాల నిర్వహణపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈనెల 20 నుంచి మూడు రోజుల పాటు ఈ సమావేశాలను నిర్వహించనున్నారు. మూడు రాజధానుల ప్రతిపాదన నేపథ్యంలో దీనికి ప్రాధాన్యం ఏర్పడింది. రాజధాని సహా కీలక బిల్లులపై ఈ సమావేశాల్లో చర్చించే అవకాశముంది.

అసెంబ్లీ శీతాకాల సమావేశాల చివరి రోజున మూడు రాజధానులు రావొచ్చంటూ సీఎం జగన్‌ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో చర్చనీయాంశమయ్యాయి. రాజధాని అమరావతి ప్రాంతంలో దీనిపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. రాజధానిని తరలించవద్దంటూ 27 రోజులుగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు జరగనుండటంతో అందరి దృష్టీ వాటిపై పడనుంది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.