close
Array ( ) 1

తాజా వార్తలు

Updated : 02/05/2020 16:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కనీసం లక్ష పడకలు సిద్ధం చేసుకోవాలి:జగన్‌

అమరావతి: కరోనా కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్న క్లస్టర్లలో ప్రజల కదలికలను కట్టడి చేయాలని ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. కొవిడ్‌-19 నివారణ చర్యలు, లాక్‌డౌన్‌ పొడిగింపు, కేంద్ర హోంశాఖ మార్గదర్శకాలపై మంత్రులు ఆళ్ల నాని, కన్నబాబు, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్‌, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులతో సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్ సమీక్ష నిర్వహించారు. వివిధ రాష్ట్రాలు, విదేశాల్లో చిక్కుకున్న వారంతా తిరిగి రాష్ట్రానికి వస్తున్న నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రధానంగా చర్చించారు.

ప్రతి గ్రామ సచివాలయాన్ని ఒక యూనిట్‌గా తీసుకొని కనీసం 10 నుంచి 15 మందికి క్వారంటైన్‌ వసతి కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ పరిస్థితుల్లో కనీసం లక్ష పడకలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. అంగన్వాడీలు, మెప్మా, పంచాయతీరాజ్‌ విభాగాలు గ్రామాల్లో చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కనీసం 500 ఆర్టీసీ బస్సులను నిత్యావసరాలు తీసుకెళ్లే మొబైల్‌ వాహనాలుగా తీర్చిదిద్దాలని సూచించారు. ఇందులోనే వీలైనంత వరకు ఫ్రీజర్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. పాలు, పెరుగు, గుడ్లు, పండ్లు వంటి నిత్యావసరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఒక వైద్యుడు, ఏఎన్‌ఎం, ఆశా కార్యకర్త, మందులు మొబైల్‌ యూనిట్‌లో అందుబాటులో ఉండాలని జగన్‌ ఆదేశించారు.

కేంద్ర హోంశాఖ సూచనల మేరకు రాష్ట్రంలో కంటైన్‌మెంట్‌ జోన్లు గుర్తించామన్నారు. కంటైన్‌మెంట్‌ జోన్లలో అనుసరించాల్సిన వ్యూహాలపై విధివిధానాలు, అనుమతులున్న దుకాణదారుల వద్ద  పాటించాల్సిన విధివిధానాలను రూపొందించాల్సిందిగా అధికారులను ఆదేశించారు.

మే 30 వరకు రైతు భరోసా కేంద్రాలు ప్రారభించాలన్నారు. మార్కెట్‌ ఇంటెలిజెన్స్ వ్యవస్థను బలోపేతం చేయాలని ఆదేశించారు. రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిల్లో వ్యవసాయ సలహా బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. వీటన్నింటిపై విధివిధానాలు ఖారురు చేయాలని అధికారును  ఆదేశించారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.