close

తాజా వార్తలు

Updated : 29/10/2020 10:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఎస్వీబీసీ ఛైర్మన్‌గా సాయికృష్ణ యాచేంద్ర

అమరావతి: తితిదే ఆధ్వర్యంలోని శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్‌ (ఎస్వీబీసీ) నూతన ఛైర్మన్‌గా నెల్లూరు జిల్లా వెంకటగిరి రాజ కుటుంబీకులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ వీబీ సాయికృష్ణ యాచేంద్ర నియమితులయ్యారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెండేళ్లపాటు సాయికృష్ణ ఆ పదవిలో కొనసాగనున్నారు. తెదేపా వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ పిలుపుమేరకు సాయికృష్ణ రాజకీయాల్లోకి వచ్చారు. 1985లో వెంకటగిరి నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2019 ఎన్నికల నుంచి ఆయన కుటుంబం వైకాపాకు అనుకూలంగా వ్యవహరిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో సాయికృష్ణను ఎస్వీబీసీ ఛైర్మన్‌గా ప్రభుత్వం నియమించింది. 

గతంలో ఎస్వీబీసీ ఛైర్మన్‌గా ఉన్న సినీనటుడు పృథ్వీరాజ్‌ ఆ పదవికి రాజీనామా చేశారు. మహిళా ఉద్యోగితో అనుచితంగా ప్రవర్తించారంటూ ఆయనపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో పృథ్వీ రాజీనామా చేయాల్సి వచ్చింది.  



Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.