close

తాజా వార్తలు

Published : 05/07/2020 03:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నేరం చేసినవాళ్లను వదిలేయాలా?: సుచరిత

గుంటూరు:  విశాఖను పరిపాలనా రాజధాని చేస్తున్నట్టు ఏపీ హోంమంత్రి సుచరిత స్పష్టంచేశారు. అలాగే, శ్రీబాగ్‌ ఒప్పందం ప్రకారం కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. అన్నిప్రాంతాలు అభివృద్ధి కావాలనేదే తమ ప్రభుత్వ ఆలోచన అన్నారు. అమరావతిలో తెదేపా అభ్యర్థుల ఓటమి ద్వారా ప్రజలే తీర్పు చెప్పారని వ్యాఖ్యానించారు. 108, 104లకు రూ.200 కోట్లు ఖర్చయితే రూ. 300 కోట్ల అవినీతి జరిగిందని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారని ఎద్దేవాచేశారు. అమరావతిలో 50వేల మందికి పట్టాలిస్తుంటే తెదేపా అధినేత చంద్రబాబు కోర్టుకెళ్లారని విమర్శించారు. తెదేపా సీనియర్‌ నేతలు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్రను అరెస్టు చేస్తే తప్పుబడుతున్నారనీ.. నేరం చేసినవాళ్లను వదిలేయాలని తెదేపా నేతలు కోరుతున్నారా? అని సుచరిత ప్రశ్నించారు. 


 


 

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని