close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 03/07/2020 21:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఏపీలో 32 రోజుల్లో 13,258 కరోనా కేసులు

పరీక్షల వ్యూహం వివరించిన వైద్యారోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి జవహర్‌ రెడ్డి

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో 19 కరోనా నిర్ధారణ ప్రయోగశాలలు ఏర్పాటు చేసుకున్నామని వైద్యారోగ్యశాఖ ప్రత్యేక కార్యదర్శి జవహర్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వ ల్యాబులు 15, ప్రైవేటు ల్యాబులు 4 ఉన్నాయని తెలిపారు. దాదాపు 47 వరకు ఆర్‌టీపీసీఆర్‌ యంత్రాలు ఉన్నాయని వెల్లడించారు. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 9.7 లక్షల నమూనాలు పరీక్షించామని తెలిపారు. సగటున 10 లక్షలకు 18,200 మందిని పరీక్షించామని పేర్కొన్నారు.

అన్‌లాక్‌ 1లో ప్రజల కదలికలు పెరగడంతో కేసులు పెరుగుతున్నాయని జవహర్‌రెడ్డి వివరించారు. లాక్‌డౌన్‌ అమలు చేయకముందు మార్చి 24కు 8 కేసులు ఉన్నాయన్నారు. లాక్‌డౌన్‌ వన్‌లో 495 కేసులు నమోదయ్యాయని తెలిపారు. మర్కజ్‌ వల్ల ఆ సమయంలో ఎక్కువ కేసులు వచ్చాయని పేర్కొన్నారు. లాక్‌డౌన్‌ రెండులో 1,147 కేసులు, లాక్‌డౌన్‌ మూడులో 782 కేసులు, లాక్‌డౌన్‌ నాలుగులో 1244 కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. అన్‌లాక్‌ 1లో కేవలం 32 రోజుల్లో 13,258 కేసులు వచ్చాయని వివరించారు. ప్రజల కదలికలు, ప్రయాణాలు, రవాణా పెరిగాక దేశవ్యాప్తంగా ఇదే ఒరవడి కనిపిస్తోందని తెలిపారు. 

పరీక్షల విషయంలో రాష్ట్రంలో రెండు వ్యూహాలు అమలు చేశామని జవహర్‌రెడ్డి తెలిపారు. వేర్వేరు రంగాల్లో వ్యాప్తి ఎలా ఉందో తెలుసుకున్నామని వివరించారు. వలసజీవులు, నిర్మాణ కూలీలు, వ్యవసాయ కూలీలు, కూరగాయలు, పండ్ల వ్యాపారులు, పరిశ్రమల్లో పనిచేసేవారు, మార్కెట్‌యార్డ్‌ వర్కర్లు, హెల్త్‌ కేర్‌ సిబ్బంది, కొవిడ్‌ కట్టడికి ముందు వరుసలో పనిచేస్తున్నవారు, హోల్‌సేల్ ‌మార్కెట్లలో పనిచేసేవాళ్లని ర్యాండమ్‌గా పరీక్షించామన్నారు.

వ్యవసాయం కూలీలకు 8400 టెస్టులు చేయగా 115 మందికి పాజిటివ్‌ వచ్చిందన్నారు. గుంటూరు, విజయనగరం జిల్లాల్లో ఈ రంగంలో ఎక్కువ కేసులు కనిపించాయన్నారు. నిర్మాణ రంగంలో 1250 (తూర్పు గోదావరి), ఆరోగ్య రంగంలో 12,500 (గుంటూరు, చిత్తూరు), మాల్స్‌లో 700 (కడప), మార్కెట్‌ యార్డుల్లో 1750 (గుంటూరు, కడప), వలస జీవుల్లో 21,000 (విజయనగరం) నమూనాలు పరీక్షించామని తెలిపారు. ఆరోగ్యసేతు బ్లూటూత్‌ కాంటాక్టుల ద్వారా 15వేల మందికి పరీక్షించగా 415 మందికి పాజిటివ్‌ వచ్చిందన్నారు. కర్నూలు, గుంటూరు, వైజాగ్‌లలో ఇలాంటి కేసులు అధికంగా ఉన్నాయన్నారు. రైళ్లలో వచ్చిన బయటి వారికి ర్యాండమ్‌గా 2500 పరీక్షలు చేయగా ప్రకాశం జిల్లాలో ఎక్కువ కేసులు కనిపించాయని జవహర్‌రెడ్డి వెల్లడించారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.