ఎస్‌ఈబీకి అధికారుల నియామకం
close

తాజా వార్తలు

Published : 13/05/2020 02:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

 ఎస్‌ఈబీకి అధికారుల నియామకం

అమరావతి: రాష్ట్రంలో మద్యం, ఇసుక అక్రమాల నిరోధానికి ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో( ఎస్‌ఈబీ)కి అధికారులను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్‌ఈబీ ఎక్స్‌ అఫీషియో కార్యదర్శిగా డీజీపీని నియమించింది. ఐపీఎస్‌ అధికారి వినీత్‌ బ్రిజే లాల్‌ను ఎస్‌ఈబీ కమిషనర్‌గా బదిలీ చేశారు. జిల్లా స్థాయిలో ఏఎస్పీ స్థాయి అధికారులను ఎస్‌ఈబీ పర్యవేక్షకులుగా నియమించింది. అరిఫ్‌ హాఫిజ్‌ను గుంటూరు గ్రామీణ, గరుడ్‌ సుమిత్‌ సునీల్‌ను తూర్పుగోదావరి జిల్లా, రాహుల్‌ దేవ్‌సింగ్‌ను విశాఖ గ్రామీణ, అనిత వెజెండ్లను విశాఖపట్నం నగరం, గౌతమి సాలినిని కర్నూలు జిల్లా , వకుల్‌ జిందాల్‌ను కృష్ణా జిల్లా, రిశాంత్‌రెడ్డిని చిత్తూరుకు కేటాయించింది. తక్షణమే ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని ఆదేశాల్లో పేర్కొంది.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని