
తాజా వార్తలు
నట్టూ ఒక్కడే మనసులు గెలిచాడు
ఇంటర్నెట్‌డెస్క్: ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20లో నటరాజన్ ఒక్కడే మనసులు గెలిచాడని టీమ్ఇండియా మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా ప్రశంసించాడు. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 194 పరుగుల భారీ స్కోర్ సాధించింది. భారత బౌలర్లు ధారాళంగా పరుగులిచ్చారు. ఆదిలోనే నటరాజన్ డీఆర్కీ షార్ట్(9)ను ఔట్ చేసినా.. వేడ్(58; 32 బంతుల్లో 10x4, 1x6), స్టీవ్‌స్మిత్(46; 38 బంతుల్లో 3x4, 2x6) రెచ్చిపోయి ఆడారు. అనంతరం మాక్స్వెల్(22), హెన్రిక్స్(26), స్టాయినిస్ (16), డానియల్ సామ్స్(8) క్రీజులో ఉన్నంతసేపు ధాటిగా ఆడారు. ఈ క్రమంలోనే ఆ జట్టు భారీ స్కోర్ చేసింది. భారత బౌలర్లలో దీపక్ చాహర్ 48, వాషింగ్టన్ సుందర్ 35, శార్దూల్ ఠాకుర్ 39, చాహల్ 51 పరుగులివ్వగా నటరాజన్ 20 పరుగులే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం చోప్రా తన ఫేస్బుక్లో మాట్లాడుతూ నట్టూని పొగడ్తలతో ముంచెత్తాడు.
‘ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ టీమ్ఇండియా బౌలింగ్‌పై విరుచుకుపడ్డారు. షార్ట్ త్వరగా ఔటైనా మాథ్యూవేడ్ బౌలర్లందరినీ చితకొట్టాడు. శార్దుల్, దీపక్, వాషింగ్టన్‌తో పాటు చివరికి చాహల్‌ను కూడా ఉతికారేశాడు. ఈ స్పిన్ బౌలర్ 4 ఓవర్లలో ఏకంగా 51 పరుగులిచ్చాడు. అయితే, నటరాజన్ ఒక్కడే అందరి మనుసులు గెలుచుకున్నాడు. అతడికిది రెండో టీ20, మూడో అంతర్జాతీయ మ్యాచ్ మాత్రమే. నాలుగు స్పెల్స్‌లో ఒక్కొక్క ఓవర్ ఇచ్చినా చాలా పొదుపుగా బౌలింగ్ చేయడమే కాకుండా 2 వికెట్లు తీశాడు. మిగతా బౌలర్లంతా ఈ మ్యాచ్‌లో అతడి ప్రదర్శనను చూసి చాలా కాలం గుర్తు ఉంచుకుంటారు. ఈ మ్యాచ్‌లో నటరాజనే అతి పెద్ద సానుకూలాంశం. అతడు చాలా బాగా బంతులేస్తున్నాడు’ అని చోప్రా మెచ్చుకున్నాడు.
ఇవీ చదవండి..
ఏడాదిగా కోహ్లీసేన జైత్రయాత్ర..
కాసిన్ని కవ్వింపులుంటే బాగుండు