
తాజా వార్తలు
పాండ్య నాణ్యమైన బ్యాట్స్‌మన్: ఆకాశ్
ఇంటర్నెట్‌డెస్క్: నైపుణ్యం గల బ్యాట్స్‌మెన్ కన్నా అతడేం చేయగలడో నిరూపించాడని టీమ్ఇండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య బ్యాటింగ్ తీరును మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా ప్రశంసించాడు. శుక్రవారం ఆస్ట్రేలియాతో తలపడిన తొలి వన్డేలో పాండ్య(90) తృటిలో శతకం కోల్పోయిన సంగతి తెలిసిందే. అతడున్నంత సేపు భారత శిబిరంలో ఆశలు నిలిపాడని ఆకాశ్ పేర్కొన్నాడు. తాజాగా తన యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడిన చోప్రా ఈ మ్యాచ్‌పై విశ్లేషణ చేశాడు. ఈ సందర్భంగా పాండ్య ఆటను పొగడ్తలతో ముంచెత్తాడు. టీమ్ఇండియా ఆల్‌రౌండర్ పూర్తిస్థాయి బ్యాట్స్‌మన్‌గా ఆడుతున్నాడని, మున్ముందు కూడా ఇలాగే బ్యాటింగ్ చేస్తాడని కొనియాడాడు. ఇంత కీలకమైన ఆటగాడు ఆరో స్థానంలో ఆడుతున్నాడని, త్వరలోనే అతడు నాలుగైదు స్థానాలకు మారుతాడని చోప్రా అభిప్రాయపడ్డాడు.
‘ వచ్చిన అవకాశాన్ని పాండ్య సద్వినియోగం చేసుకున్నాడు. ఒక నాణ్యమైన బ్యాట్స్‌మన్ ఆరో స్థానంలో ఆడటం ఎన్నిసార్లు కుదురుతుంది? అతడికి ఆ అవకాశం రావడంతో నిరూపించుకున్నాడు. తన ఆటతీరుతో ప్రధాన బ్యాట్స్‌మెన్ కన్నా ఎక్కువే ఆడగలనని చాటిచెప్పాడు. ఇతరులు షార్ట్‌పిచ్ బంతులతో సతమతమయితే అతడు మాత్రం వాటిని దీటుగా ఎదుర్కొన్నాడు. స్పిన్నర్లను కూడా ఉతికారేశాడు. తృటిలో సెంచరీ కోల్పోయినా క్రీజులో ఉన్నంతసేపు ఆశలు నింపాడు. ధావన్‌తో కలిసి 100 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పగా అతడే 75 పరుగులు చేశాడు. పాండ్య అద్భతమైన ఆటతో ఆకట్టుకున్నాడు. త్వరలోనే నాలుగు లేదా ఐదు స్థానాల్లో బ్యాటింగ్ చేస్తాడు’ అని మాజీ క్రికెటర్ చెప్పుకొచ్చాడు. కాగా, ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 374/6 భారీ స్కోర్ సాధించిన సంగతి తెలిసిందే. ఆరోన్ ఫించ్(114), స్టీవ్‌స్మిత్(105) శతకాలతో మెరవగా భారత బ్యాట్స్‌మెన్ తేలిపోయారు. పాండ్య(90), ధావన్(74) అర్ధ శతకాలు సాధించారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- RRRపై సెటైర్.. స్పందించిన చిత్రబృందం
- రివ్యూ: అల్లుడు అదుర్స్
- అరెరె షా.. రోహిత్‌కు కోపం తెప్పించేశావ్‌గా!
- యూట్యూబర్ తప్పుడు రివ్యూ.. మూతపడ్డ హోటల్
- పంత్ తీరుపై అంపైర్లు కలగజేసుకోవాలి
- 75 డ్రోన్లు విరుచుకుపడి..!
- 60 ఏళ్ల తర్వాత టీమ్ఇండియా 20 ఆటగాళ్లతో..
- వాయుసేన తలనొప్పికి తేజస్ మందు..!
- జో బైడెన్ కీలక ప్రతిపాదన
- లడ్డూ కావాలా..? పంచ్ ఇచ్చిన దిశాపటాని
ఎక్కువ మంది చదివినవి (Most Read)
