
తాజా వార్తలు
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నఆరోన్ ఫించ్
కాన్బెరా: మరికాసేపట్లో టీమ్ఇండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలి టీ20 జరగనుంది. ఈ సందర్భంగా టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇప్పటికే 2-1తో వన్డే సిరీస్ గెలుపొందిన ఆ జట్టు ఇప్పుడు పొట్టి సిరీస్‌పైనా కన్నేసింది. మరోవైపు మూడో వన్డేలో విజయం సాధించిన టీమ్ఇండియా ఈ మ్యాచ్‌లో బోణీ కొట్టి తర్వాతి టీ20లపై పట్టుబిగించాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య పోటాపోటీ నెలకొనే అవకాశం ఉంది. దీంతో తొలి టీ20పై ఆసక్తి పెరిగింది.
భారత జట్టు: కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ(కెప్టెన్), మనీష్ పాండే, సంజూ శాంసన్, హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, దీపక్ చాహర్, నటరాజన్, షమీ
ఆస్ట్రేలియా జట్టు: ఆరోన్ ఫించ్(కెప్టెన్), డిఆర్కీ షార్ట్, మాథ్యూవేడ్, స్టీవ్‌స్మిత్, గ్లెన్ మాక్స్వెల్, హెన్రిక్స్, సీన్ అబోట్, మిచెల్ స్టార్క్, మిచెల్ స్వీప్సన్, ఆడం జంపా ,జోష్ హాజిల్‌వుడ్,