జగిత్యాల జిల్లాలో మహిళపై యాసిడ్‌ దాడి
close

తాజా వార్తలు

Published : 24/12/2020 00:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

జగిత్యాల జిల్లాలో మహిళపై యాసిడ్‌ దాడి

ఇబ్రహీంపట్నం: జగిత్యాల జిల్లాలో మహిళపై యాసిడ్‌ దాడి కలకలం రేపింది. జిల్లాలోని ఇబ్రహీంపట్నం మండల పరిధి తిమ్మాపూర్‌ తండాలో ఈ ఘటన చోటుచేసుకుంది. తండా సమీపంలోని బస్టాండ్‌ నుంచి వెళ్తున్న ఓ మహిళపై గుర్తుతెలియని దుండగులు యాసిడ్‌ పోసి పరారయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని తిమ్మాపూర్‌ తండాకు చెందిన భూక్యా స్వాతి, అదే మండలంలోని డబ్బా గ్రామానికి చెందిన రవితో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. స్వాతి భర్త రవి ఆరు నెలల క్రితం చనిపోయాడు. కాగా ఇటీవల ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు స్వాతి తన పుట్టింటికి వెళ్లింది. ఈ క్రమంలోనే ఇవాళ పనిమీద మెట్‌పల్లికి వెళ్లిన స్వాతి సాయంత్రానికి తండా బస్టాండ్‌కు చేరుకుంది. అక్కడి నుంచి తన ఇంటికి వెళ్తుండగా.. హెల్మెట్‌ ధరించి ఉన్న గుర్తుతెలియని దుండగుడు ఆమె ముఖంపై యాసిడ్‌ పోసి పరారయ్యాడు. ఈ దాడిలో మహిళ ముఖం కుడి భాగం కాలిపోయింది. గమనించిన స్థానికులు వెంటనే బాధితురాలని మెట్‌పల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెట్‌పల్లి, ఇబ్రహీంపట్నం పోలీసులు ఘటనా స్థాలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని