close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 22/03/2020 16:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కష్టాలను పంచుకొన్న కోటీశ్వరులు..

ఇంటర్నెట్‌డెస్క్‌: కష్టం వచ్చినప్పుడు అందరూ ఏకం కావాలి.. మనం సమాజం నుంచి ఎదిగాం.. పరోక్షంగా మన ఎదుగుదలలో సమాజం ఎంతో సహకరించింది.. ఈ విషయాలను గుర్తించి ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది వ్యాపారవేత్తలు స్వచ్ఛందంగా కరోనా వైరస్‌పై పోరాటంలో తమ వంతు సాయం చేస్తున్నారు. డబ్బున్నవారు నిర్బంధంలో ఉన్నా, వారికి ఎటువంటి ఇబ్బంది ఉండదు.. కానీ, రోజువారీ కూలీ పనులు చేసే పేదలు.. చిరు ఉద్యోగులు.. నెల ఖర్చుల్లో  కొంచెం తేడా వచ్చినా అతలాకుతలమైపోయే కుటుంబాలెన్నో ఈ వైరస్‌  కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. కేవలం  ప్రాణాలు దక్కితే చాలు అన్న భయంతో కష్టాలను దిగమింగుకొని జీవిస్తున్నారు.  ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో  ఇదే పరిస్థితి నెలకొంది. మరోపక్క ఈ క్రమంలో కొందరు బిలియనీర్లు తమ సంపదలో కొంత మొత్తం ఆరోగ్యసేవలను మెరుగు పర్చేందుకు విరాళంగా ఇస్తూ ప్రభుత్వాలకు అండగా ఉంటున్నారు. 

బాధతెలుసు కాబట్టే.. ముందుకు..

కరోనావైరస్‌ అత్యంత దారుణంగా బీభత్సం సృష్టించిన దేశం చైనా. ఇక్కడ దాదాపు 80వేల మందికిపైగా కరోనావైరస్‌ బాధితులు తేలారు. అలీబాబా అధినేత జాక్‌మా స్వయంగా చైనాలో పరిస్థితిని కళ్లారా చూశారు. వెంటనే అమెరికాకు 5,00,000 కరోనా వైరస్‌ పరీక్ష కిట్లను.. 10లక్షల ఫేస్‌ మాస్క్‌లను పంపించారు. కఠిన సమయంలో అమెరికన్లతో కలిసి పనిచేస్తామని ఆయనకు సంబంధించిన ఛారిటీ సంస్థ  ఈ విషయాన్ని ట్విటర్‌లో పేర్కొంది. ఏ ఒక్క దేశం ఈ వైరస్‌ను సొంతంగా అడ్డుకోలేదు. మనందరం సంయుక్తంగా ఈ వైరస్‌తో పోరాడుదాం’’ అని పేర్కొంది.  జాక్‌మా కూడా నేరుగా స్పందిస్తూ..‘‘ నా దేశంలో ఎదురైన అనుభవాలను నేర్చుకున్నది ఏంటంటే.. అత్యంత కచ్చితత్వంతో ఈ వైరస్‌ను గుర్తించే కిట్లు, వ్యక్తిగత సంరక్షణ పరికరాలు దీనిని అడ్డుకొనేందుకు ఉపయోగపడతాయి. మా విరాళం అమెరికన్లు కరోనా వైరస్‌పై పోరాడేందుకు ఉపయోగపడతాయని భావిస్తున్నాం’’ అని పేర్కొన్నారు. 

ఫేస్‌బుక్‌ చొరవ..

ఫేస్‌బుక్‌ అధినేత మార్క్‌ జుకర్‌బర్గ్‌ కొవిడ్‌-19పై పోరాటంలో భాగంగా పరీక్షల, బాధితుల గుర్తింపు కోసం పనిచేస్తున్నారు. ఆయనకు చెందిన చాన్‌ జుకర్‌బర్గ్‌ ఇనీషేటీవ్‌ కృషి చేస్తోంది. ఈ వైరస్‌ వ్యాప్తి కారణంగా దెబ్బతిన్న చిరు వ్యాపారులను ఆదుకొనేందుకు 100 మిలియన్‌ డాలర్లను కేటాయించింది. అంతేకాదు 20 మిలియన్‌ డాలర్లను ప్రపంచ ఆరోగ్య సంస్థకు, యూఎస్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌కు కేటాయించారు. 

విద్యాలయాలకు విరాళంగా..

వైరస్‌ కారణంగా చైనా, జపాన్‌, ఇటలీలోని కిండర్‌గార్డెన్‌ నుంచి 12వ తరగతి  ఉన్న పాఠశాలలు మూతపడ్డాయి. దీంతో ఎరిక్‌ యువాన్‌ నేతృత్వంలోని జూమ్‌ వీడియోస్‌ టెక్నాలజీ సంస్థ ఈ వైరస్‌ ప్రభావిత పాఠశాలలు ఉచితంగా ఉపయోగించుకొనే అవకాశం కల్పించింది.  

కరోలీనా కోసం..

డేవిడ్‌ టెప్పెర్‌ నేతృత్వంలోని ది నార్త్‌ కరోలీనా పాంథర్స్ 2.6 మిలియన్‌ డాలర్లను అందజేసింది. కొవిడ్‌-19పై పోరాటంలో భాగంగా ఈ నిధులను వినియోగించనున్నారు. 

అద్దె మినహాయింపు..

ఫిలిప్పీన్స్‌కు చెందిన ఎస్‌ఎం ప్రైమ్‌ ప్రాపర్టీ డెవలెపర్స్‌ సంస్థ తమ ఆస్తుల్లో అద్దెకు ఉంటున్న కిరాయిదార్లకు మార్చి 16 నుంచి ఏప్రిల్‌ 14 వరకు అద్దెను మినహాయింపును ఇచ్చింది. 1.9మిలియన్‌ డార్లను వైద్య పరికరాల సరఫరాకు కేటాయించింది. 

హామీ మార్చుకొని..

సాఫ్ట్‌ బ్యాంక్‌ సీఈవో మసియోషి సన్‌ మూడేళ్ల తర్వాత ట్విటర్‌ వేదికగా తొలిసారి స్పందించారు. 10 లక్షల కరోనా వైరస్‌ పరీక్షలను ఉచితంగా చేస్తానని స్పందించారు. కానీ, వైద్య సిబ్బందిపై అనవసర ఒత్తిడి పెరుగుతుందనే విమర్శలు రావంతో 10లక్షల మాస్కులను ఉచితంగా ఇచ్చేందుకు సిద్ధమైనట్లు ఆయన ప్రతినిధి వెల్లడించారు.

షెర్లీ శాండ్‌బర్గ్‌..

ఫేస్‌బుక్‌ సీవోవో షెర్లీ శాండ్‌ బర్గ్‌ దాదాపు 7 మిలియన్‌ డాలర్ల విలువ చేసే ఆహార నిల్వల ఏర్పాటుకు  ఆమె నడుంబిగించారు. 

వ్యాక్సిన్‌ పరిశోధనలకు గేట్స్‌ ఊతం..

టెక్‌టైకూన్‌ బిల్‌గేట్స్‌ కూడా కరోనాపై పోరాటంలో ముందు నిలిచారు. ఆయన 10 మిలియన్‌ డాలర్లను వ్యాక్సిన్‌పై పరిశోధనలకు కేటాయించారు. 

1.3మిలియన్‌ డాలర్లు..

ఇటలీకి చెందిన ఫ్యాషన్‌ ఉత్పత్తుల సంస్థ వ్యవస్థాపకుడు జార్జియో అర్మానీ తన సంపద నుంచి 1.3 మిలియన్‌ డాలర్లను విరాళంగా ఇచ్చారు. ఇటలీలో కొవిడ్‌-19ను అడ్డుకొనేందుకు స్వచ్ఛందంగా చర్యలు తీసుకొన్న వ్యక్తి ఆయనే. ఆయనకు చెందిన జార్జియో అర్మానీ గ్రూప్‌ మిలాన్‌ ఫ్యాషన్‌ వీక్‌ను రద్దు చేసింది. ఫిబ్రవరి 23నే ఈ నిర్ణయం తీసుకొంది. మార్చి 10నాటికి సంస్థకు చెందిన అన్ని స్టోర్లనూ పూర్తిగా మూసేసింది. 

40 మిలియన్‌ డాలర్లతో కార్యక్రమాలు.. మీడియా బిలియనీర్‌ మైఖేల్‌ బ్లూమ్‌బెర్గ్‌ 40 మిలియన్‌ డాలర్లను కొవిడ్‌-19 వ్యాప్తిని అడ్డుకొనే కార్యక్రమాలు మొదలుపెట్టారు. ప్రపంచ ఆరోగ్య సంస్థతో కలిసి వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.