close

తాజా వార్తలు

Published : 10/11/2020 01:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నటుడు అర్జున్‌ రాంపాల్‌ ఇంట్లో ఎన్‌సీబీ సోదాలు

ముంబయి: బాలీవుడ్‌లో మాదకద్రవ్యాల అంశం కలకలం సృష్టిస్తోంది. తాజాగా విలక్షణ నటుడు అర్జున్‌ రాంపాల్‌ ఇంట్లో నార్కొటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో సంస్థ సోదాలు నిర్వహించింది. ముంబయిలోని నటుడి ఇంట్లో సోమవారం ఆకస్మిక తనిఖీలు చేసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మాదకద్రవ్యాల కేసులో సమన్లు అందుకున్న నిర్మాత ‌ ఫిరోజ్‌ నదియావాలా విచారణకు హాజరుకాలేదు. కాగా జుహులోని ఆయన ఇంట్లో ఎన్‌సీబీ అధికారులు ఆదివారం సోదాలు నిర్వహించారు. సోదాల్లో వారికి 10 గ్రాముల గంజాయి పట్టుబడింది. దీంతో నిర్మాత భార్య షబానా సయీద్‌ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈనేపథ్యంలోనే నదియావాలాకు మరోసారి సమన్లు జారీ చేశారు.

నటుడు సుశాంత్‌సింగ్‌ రాజ్‌పూత్‌ మృతి విచారణలో భాగంగా బాలీవుడ్‌లో మాదకద్రవ్యాల వినియోగం బయటపడింది. సుశాంత్‌ సన్నిహితురాలు రియా చక్రవర్తి అతడికి డ్రగ్స్‌ సరఫరా చేసినట్లు తేల్చిన అధికారులు ఆమెను అరెస్టు చేశారు. ఈ కేసులో రియా సోదరుడితోపాటు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఆమె వాట్సాప్‌ చాట్ ఆధారంగా ప్రముఖ నటీమణులకు దర్యాప్తు సంస్థ నోటీసులు జారీ చేసింది. దీపికా పదుకొణే, శ్రద్ధా కపూర్‌, సారా అలీఖాన్‌, రకుల్‌ప్రీత్‌సింగ్‌ను అధికారులు విచారించారు. వీరితోపాటు పలువురు ప్రముఖులను ప్రశ్నించారు.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన