
తాజా వార్తలు
‘అద్దం’.. ఏది ఒప్పు.. ఏది తప్పు..?
హైదరాబాద్: వరలక్ష్మి శరత్ కుమార్, ప్రసన్న, కిశోర్ కుమార్, అర్జున్ చిదంబరం, రోహిణి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘అద్దం’. ఈ సినిమా ట్రైలర్ను కథానాయకుడు సూర్య విడుదల చేశారు. ఒక్క థీమ్.. మూడు కథలతో దర్శకుడు దీన్ని తెరకెక్కించారు. ఏది ఒప్పు.. ఏది తప్పు.. ఏది మంచి.. అంటూ వివిధ కథల్ని, కోణాల్ని చూపే ప్రయత్నం చేశారు. ‘నేను ఇప్పటి వరకు ఎవరికీ చెప్పని విషయం.. మీకు చెప్పాలనుకుంటున్నాను..’ అనే డైలాగ్తో ట్రైలర్ ఆరంభమైంది. ‘డబ్బు.. అది ఉంటే చాలు, ఎవడైనా.. ఏదైనా చేయొచ్చు..’ అంటూ వరలక్ష్మి అసహనం వ్యక్తం చేశారు. ‘వాడు పడుకుని ఉన్నప్పుడు తలమీద రాయి వేసి చంపేద్దాం అనుకునేదాన్ని..’ అని నటి రోహిణి ఓ కుర్రాడికి చెబుతూ కనిపించారు. ఇలా కొన్ని కథలతో ప్రచార చిత్రాన్ని ఆసక్తికరంగా రూపొందించారు. అక్టోబరు 16న ఆహా ఓటీటీ వేదికగా ఈ చిత్రం విడుదల కాబోతోంది.
Tags :