close

తాజా వార్తలు

Published : 20/10/2020 01:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆ నలుగురి హత్య కేసులో మరో కోణం!

ముంబయి: మహారాష్ట్రలోని జల్‌గావ్‌లో ఈ నెల 15న ఒకే కుటుంబానికి చెందిన నలుగురు హత్యకు గురికావడం చర్చనీయాంశమైంది. 13, 6 సంవత్సరాల బాలికలు, 11, 8 ఏళ్ల ఇద్దరు బాలురని దుండగులు అత్యంత దారుణంగా హత్య చేశారు. గిరిజన తెగకు చెందిన ఈ పిల్లలను గొడ్డలితో నరికి చంపారు. ఈ ఘటన జరిగి నాలుగు రోజులు గడిచినప్పటికీ పోలీసులు ఎవరినీ అదుపులోకి తీసుకోలేదు. అయితే ఈ హత్య కేసులో తాజాగా మరో కోణం వెలుగు చూసింది. నలుగురిని హత్య చేసే ముందు దుండగులు బాలికలపై అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు.

ఈ విషయాలను తాజాగా పోలీసులు ఛార్జిషీటుకు జత చేశారు. ‘ఘటనపై విచారణ జరుపుతున్నాం. నిందితులను త్వరలోనే అదుపులోకి తీసుకుంటాం’ అని పోలీసు ఉన్నతాధికారి పేర్కొన్నారు. శనివారం జల్‌గావ్‌లో పర్యటించిన రాష్ట్ర హోంశాఖ మంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ మాట్లాడుతూ దర్యాప్తు వేగవంతగానే జరుగుతోందని వివరించారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు త్వరలోనే నిందితులను పట్టుకుంటారని తెలిపారు.

జల్‌గావ్‌ జిల్లా రావెర్‌ తాలూకాలోని ఓ గ్రామంలో అక్టోబర్‌ 15న ఈ దారుణం చోటుచేసుకుంది. అద్దె ఇంట్లో నలుగురు చిన్నారులను అతి కిరాతకంగా హత్యచేశారు. మరుసటి ఉదయం చిన్నారులు రక్తపుమడుగులో పడి ఉండటాన్ని ఇంటి యజమాని చూసి పోలీసులకు సమాచారం అందించారు. చిన్నారుల తల్లిదండ్రులు పెద్ద కుమారుడితో కలిసి బంధువు అంత్యక్రియలకు వెళ్లగా దుండగులు ఈ దారుణానికి ఒడిగట్టారు.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన