close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 24/06/2020 01:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

3 చైనా బ్యాంకులకు వ్యక్తిగత హామీ ఇవ్వలేదు

అనిల్‌ అంబానీ వెల్లడి

ముంబయి: మూడు చైనా బ్యాంకుల నుంచి రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ (ఆర్‌కామ్‌) తీసుకున్న రుణాలకు ఎటువంటి వ్యక్తిగత హామీ ఇవ్వలేదని అనిల్‌ అంబానీ స్పష్టం చేశారు. మూడు చైనా బ్యాంకులకు 717 మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.5400 కోట్లు) చెల్లించాల్సిందిగా అనిల్‌ను బ్రిటన్‌ కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే ఎస్‌బీఐ వద్ద తీసుకున్న రుణానికి మాత్రం వ్యక్తిగత హామీ ఇచ్చినట్లు సంకేతాలు ఇచ్చారు. ఇటీవల రూ.1200 కోట్ల రుణ రికవరీ కోసం ఎన్‌సీఎల్‌టీని ఎస్‌బీఐ ఆశ్రయించింది. ఈ రెండు కేసుల్లో (ఎస్‌బీఐ, చైనా బ్యాంకులు) గ్రూప్‌ కంపెనీ మాత్రమే రుణం తీసుకుందని, అవి వ్యక్తిగత రుణాలు కావని అనిల్‌ వెల్లడించారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరిగిన రిలయన్స్‌ ఇన్‌ఫ్రా వార్షిక సాధారణ సమావేశం (ఏజీఎం)లో ఆయన మాట్లాడారు. 2012లో రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ తీసుకున్న కార్పొరేట్‌ రుణానికి నాన్‌-బైండింగ్‌ లేఖలో మాత్రమే పరిమితమైన పవర్‌ ఆఫ్‌ అటార్నీ సంతకం చేశానని అన్నారు. చైనా బ్యాంకులు చెబుతున్నట్లు వ్యక్తిగత హామీ మీద ఎటువంటి సంతకం చేయలేదని వివరించారు. చైనా బ్యాంకుల వాదనలపై న్యాయపరమైన సలహాలు తీసుకుంటున్నట్లు రిలయన్స్‌ ఇన్‌ఫ్రా తెలిపింది. బ్రిటన్‌ కోర్టుల్లో 100 మిలియన్‌ డాలర్ల వ్యక్తిగత మొత్తం డిపాజిట్‌ చేయలేకపోవడంతో వాదించడానికి వీలు లేకుండా పోయినట్లు వెల్లడించింది. ఆర్‌కామ్‌కు ఇచ్చిన 925 మిలియన్‌ డాలర్ల రుణాన్ని రికవరీ చేసుకునే యత్నాల్లో భాగంగా ఇండస్ట్రీయల్‌ అండ్‌ కమర్షియల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ చైనా, చైనా డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌, ఎగ్జిమ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ చైనాలు అనిల్‌ అంబానీని బ్రిటన్‌లో కోర్టుకు ఈడ్చాయి. ఈ ఏడాది మే 22న మూడు చైనా బ్యాంక్‌లకు 21 రోజుల్లోగా 717 మిలియన్‌ డాలర్లు చెల్లించాల్సిందిగా అనిల్‌ను కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.
ఆర్‌పవర్‌, ఆర్‌ఇన్‌ఫ్రాల్లో ప్రమోటర్ల వాటా పెంపు: రిలయన్స్‌ పవర్‌, రిలయన్స్‌ ఇన్‌ఫ్రా కంపెనీల్లో ప్రమోటార్ల వాటా పెంచుకోవాలని నిర్ణయించినట్లు అనిల్‌ అంబానీ తెలిపారు. గత వారం ప్రిఫరెన్షియల్‌ కేటాయింపు ద్వారా 10 శాతం వరకు వాటా పెంచుకునేందుకు ప్రమోటర్లకు సెబీ అనుమతి ఇచ్చింది. ఈ ఏడాది మార్చికి రిలయన్స్‌ ఇన్‌ఫ్రాలో 14.7 శాతం, రిలయన్స్‌ పవర్‌లో 19.29 శాతం చొప్పున ప్రమోటర్లకు వాటాలు ఉన్నాయి. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రిలయన్స్‌ ఇన్‌ఫ్రా రుణరహిత సంస్థగా మారుతుందని అనిల్‌ వెల్లడించారు. ప్రస్తుతం ఈ కంపెనీకి రూ.6000 కోట్లకు పైగా రుణాలు ఉన్నాయి. ఆస్తుల విక్రయం ద్వారా రుణ భారాన్ని తగ్గించుకోనున్నారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.