close
Array ( ) 1

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ @ 1PM  

1. ఎన్నికల తర్వాతే వద్దామనుకున్నా.. కానీ: ట్రంప్‌

రాష్ట్రపతి భవన్‌లో విందు సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను అమెరికా అధ్యక్ష ఎన్నికల తర్వాతే భారత పర్యటనకు రావాలనుకున్నానని.. కానీ, మోదీకి తన ఆలోచన నచ్చలేదని చెప్పారు. అందుకే ఇప్పుడే వచ్చేశానని తెలిపారు. ‘‘ నేను ప్రధాని మోదీకి కాల్‌ చేసి.. అమెరికా అధ్యక్ష ఎన్నికల తర్వాత వస్తే మీకేమైనా అభ్యంతరమా అని అడిగాను. ఆయన నా ఆలోచనను ఇష్టపడలేదు’’ అని ట్రంప్‌ వ్యాఖ్యానించారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. జీవీఎల్‌ వ్యాఖ్యలు ఖండిస్తున్నాం: కేశినేని

 అమరావతి పరిరక్షణ సమితి కార్యాలయాన్ని విజయవాడలోని ఆటోనగర్‌లో ఏర్పాటు చేశారు. మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు చేతుల మీదుగా కార్యాలయాన్ని ప్రారంభించారు. ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ.. రాజధాని అంశం కేంద్రం పరిధిలో లేదని భాజపా ఎంపీ జీవీఎల్‌ చెబుతున్నారు. ఇందులో రాష్ట్రానికి ఎంత సంబంధం ఉందో... కేంద్రానికి కూడా అంతే బాధ్యత ఉంది. రాజధానిపై జీవీఎల్‌ వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. సైన్యాన్ని పిలిపించండి: కేజ్రీవాల్‌

ఘర్షణల నియంత్రణకు పోలీసులు అన్ని రకాల చర్యలు చేపడుతున్నారని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ తెలిపారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు సైన్యాన్ని రంగంలోకి దింపాలని కేంద్రాన్ని కోరారు. అవసరమైతే ప్రభావిత ప్రాంతాల్లో నిషేదాజ్ఞలు విధించాలన్నారు. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాకు లేఖ రాయనున్నానని ట్విటర్‌లో కేజ్రీవాల్‌ వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ‘ఆ దాడితో ముష్కరులకు ముచ్చెమటలు’

బాలాకోట్‌ దాడితో ఉగ్రవాదులు భయపడ్డారని, అందుకే ఆ దాడి తర్వాత భారత్‌లో ఎలాంటి పెద్ద ఉగ్రఘటనలు చోటుచేసుకోలేదని వాయుసేన మాజీ అధిపతి బీఎస్‌ ధనోవా అన్నారు. పాకిస్థాన్‌లోని బాలాకోట్‌లో జైషే మహ్మద్‌ ఉగ్రస్థావరాలపై భారత్‌ వైమానిక దాడులు జరిపి సరిగ్గా నేటికి ఏడాది. ఈ సందర్భంగా ధనోవా నాటి సంగతులను గుర్తుచేసుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఈశాన్య దిల్లీ ఘటనపై హైకోర్టు సీరియస్‌

ఈశాన్య దిల్లీలో చోటుచేసుకుంటున్న ఘటనల నేపథ్యంలో పోలీసులపై దిల్లీ హైకోర్టు సీరియస్‌ అయ్యింది. హింసను అదుపుచేసేందుకు పోలీసులు కోర్టు ఆదేశాల కోసం వేచి చూడాల్సిన అవసరం లేదని, స్వయంగా చర్యలు తీసుకోవచ్చని స్పష్టం చేసింది. తాజా ఘటనలపై కేసు నమోదు చేసి, బాధ్యులను అరెస్టు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై న్యాయస్థానం నేడు విచారణ జరిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. భారత్‌తో బంధం మరింత బలోపేతం:శ్వేతసౌధం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత పర్యటన ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక బంధాన్ని మరింత బలోపేతం చేయడంలో భాగంగా జరిగిందని శ్వేతసౌధం అభిప్రాయపడింది. ఉభయ దేశాల్లో ఉద్యోగ సృష్టి జరిగేలా, సంక్షేమం పెంపొందించే దిశగా ఆర్థిక సంబంధాలు మెరగవుతున్నాయని తెలిపింది. భారత్‌లో ట్రంప్‌ పర్యటన పూర్తయిన నేపథ్యంలో బుధవారం శ్వేతసౌధం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ పర్యటన విశేషాలు, కుదిరిన ఒప్పందాలను ప్రస్తావించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఈశాన్య దిల్లీ ఘటన.. 18కు పెరిగిన మృతులు

ఈశాన్య దిల్లీలో జరిగిన ఘటనల్లో చనిపోయిన వారి సంఖ్య 18కు చేరింది. మంగళవారం నాటికి 13 మంది మృతిచెందిన విషయం తెలిసిందే. బుధవారం ఉదయానికి క్షతగాత్రుల్లో మరో ఐదుగురు ప్రాణాలు కోల్పోయినట్లు గురు తేగ్‌ బహదూర్‌(జీటీబీ) ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. పౌరసత్వ సవరణ చట్ట(సీఏఏ) వ్యతిరేక, అనుకూల వర్గాల మధ్య జరిగిన ఘర్షణల నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. పెళ్లింట విషాదం: 24 మంది మృతి

రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పెళ్లి వేడుకలకు వెళ్తున్న ఓ బస్సు నదిలో పడి 24 మంది దుర్మరణం చెందారు. బూండీలోని కోట లాల్‌సాత్‌ మెగా హైవేపై బుధవారం ఉదయం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పెళ్లి వేడుక నిమిత్తం వరుడి కుటుంబం, బంధువులతో కోట నుంచి సవాయ్‌మాధోపూర్‌ వెళ్తున్న ఓ బస్సు ప్రమాదవశాత్తు వంతెనపై నుంచి మేజ్‌ నదిలో బోల్తాపడింది. ఘటన సమయంలో బస్సులో 40 మందికి పైగా ఉన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. తొలి రౌండ్‌లోనే సానియా ఔట్‌

భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా ఖతార్ ఓపెన్‌ తొలి రౌండ్‌లోనే నిష్క్రమించింది.  మంగళవారం జరిగిన మహిళల డబుల్స్‌లో ఫ్రెంచ్‌ క్రీడాకారిణి కరోలిన్‌ గార్సియాతో కలిసి బరిలోకి దిగిన సానియా.. లారా (జర్మనీ)-కాగ్లా (టర్కీ) జంట చేతిలో ఓటమిపాలైంది. 4-6, 5-7 తేడాతో వరుస సెట్లలో పరాజయాన్ని చవిచూసి టోర్నీ నుంచి నిష్క్రమించింది. అంతకుముందు కరోలినాతో కలిసి పాల్గొన్న దుబాయ్‌ టెన్నిస్ ఛాంపియన్‌షిప్‌లోనూ సానియా రెండో రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. మార్కెట్లను వెంటాడుతున్న కరోనా భయాలు..

దేశీయ మార్కెట్లు బుధవారం వరుసగా నాలుగో రోజూ నష్టాల్లో నమోదవుతున్నాయి. మధ్యాహ్నం 1.05 గంటల సమయంలో సెన్సెక్స్‌ 219 పాయింట్లు నష్టపోయి 40,061 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 69 పాయింట్లు దిగజారి 11,729 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 71.70 వద్ద కొనసాగుతోంది. కరోనా భయాలతో అంతర్జాతీయ మార్కెట్లు ఆచితూచి వ్యవహరిస్తుండడంతో ఆ ప్రభావం దేశీయ సూచీలపై కూడా పడినట్లు కనిపిస్తోంది. 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.