close

తాజా వార్తలు

అజిత్‌ పవార్‌కు ఆర్థిక బాధ్యతలేనా?

ముంబయి: మహారాష్ట్ర రాజకీయాల్లో కేంద్ర బిందువుగా మారి.. అనూహ్య పరిణామాలకు కారణమైన ఎన్సీపీ నేత అజిత్‌ పవార్‌ ‘అధికార’ భవితవ్యంపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. దేవేంద్ర ఫడణవీస్‌ మూడు రోజుల ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న అజిత్‌కు.. మహావికాస్‌ ఆఘాడీ సంకీర్ణ ప్రభుత్వంలోనూ అదే పదవి దక్కనున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే, దానిపై సంకీర్ణ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత రాలేదు. తాజాగా ఆయనకు ఆర్థిక మంత్రి పదవి ఇచ్చే అవకాశాలున్నట్లు ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఇక డిప్యూటీ సీఎంగా ఎన్సీపీ నేత జయంత్‌ పాటిల్‌ బాధ్యతలు చేపట్టే అవకాశమున్నట్లు సమాచారం. 

ఎన్నో మలుపులు తర్వాత మహారాష్ట్రలో శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్‌ ‘మహా వికాస్‌ ఆఘాడీ’ సంకీర్ణ ప్రభుత్వం కొలువుదీరిన విషయం తెలిసిందే. గత నెల 28న ఉద్ధవ్‌ ఠాక్రే సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతో పాటు మూడు పార్టీల నుంచి ఇద్దరు చొప్పున ఆరుగురు మంత్రులుగా ప్రమాణం చేశారు. అయితే, ప్రభుత్వం ఏర్పాటై రెండు వారాలైనా ఇంకా మంత్రి పదవుల కేటాయింపులపై స్పష్టత రావట్లేదు. ఒప్పందం ప్రకారం.. శివసేనకు 10, ఎన్సీపీకి 7, కాంగ్రెస్‌కు 6 కేబినెట్‌ బెర్త్‌లు దక్కనున్నట్లు తెలుస్తోంది. 

ఇప్పటికే స్పీకర్‌గా కాంగ్రెస్‌ నేత నానా పటోలే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక డిప్యూటీ సీఎం పదవి ఎన్సీపీకి కేటాయించడంతో ఆ బాధ్యతలు అజిత్‌ పవార్‌కు అప్పగించే అవకాశాలున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. తాజాగా జయంత్‌ పాటిల్‌ పేరు వినిపిస్తోంది. ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు హోం శాఖ బాధ్యతలు కూడా పాటిల్‌కు దక్కే అవకాశాలున్నట్లు ఊహాగానాలు వెలువడుతున్నాయి. అజిత్‌ పవార్‌కు ఆర్థిక శాఖ ఇవ్వాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. 

ఇక మాజీ ముఖ్యమంత్రులు, కాంగ్రెస్‌ నేతలు అశోక్‌ చవన్‌, పృథ్విరాజ్‌ చవన్‌లకు పీడబ్ల్యూడీ, విద్యుత్‌ శాఖలు కేటాయించినట్లు సమాచారం. ఒప్పందంలో భాగంగా శివసేనకు పట్టణాభివృద్ధి, పరిశ్రమలు, వ్యవసాయం, నీటివనరులు, ఉన్నత విద్య, రవాణా శాఖలు రానున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఎన్సీపీకి కీలకమైన హోంశాఖ, ఆర్థికశాఖతో పాటు హౌసింగ్‌, కో ఆపరేటివ్స్‌, వైద్య విద్య, గ్రామీణాభివృద్ధి శాఖలు ఇవ్వనున్నట్లు సమాచారం. కాంగ్రెస్‌కు రెవెన్యూ, పీడబ్ల్యూడీ, విద్యుత్‌, ఎక్సైజ్‌, ప్రాథమిక విద్య, స్త్రీ సంక్షేమ శాఖలు వచ్చే అవకాశాలున్నాయి. 

ఆదిత్య.. కేబినెట్‌కు దూరంగానే..

ఇక సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే కుమారుడు, ఎమ్మెల్యే ఆదిత్య ఠాక్రేకు కేబినెట్‌లో చోటు కల్పించే అవకాశాలు కన్పించట్లేదు. ప్రస్తుతానికి ఆయనకు ఎలాంటి శాఖలు అప్పగింకపోవచ్చని తెలుస్తోంది. అసెంబ్లీ శీతాకాల సమావేశాల తర్వాత కేబినెట్‌ మంత్రులు, సహాయ మంత్రులపై పూర్తి స్పష్టత రానుంది. 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.