పోలీసుల అదుపులో అఖిలేశ్‌ యాదవ్‌
close

తాజా వార్తలు

Published : 07/12/2020 14:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పోలీసుల అదుపులో అఖిలేశ్‌ యాదవ్‌

లఖ్‌నవూ: యూపీ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేశ్‌ యాదవ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దిల్లీలో ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతుగా లఖ్‌నవూలో ఆయన చేపట్టిన ధర్నాను పోలీసులు అడ్డుకున్నారు. నేడు కిసాన్‌ యాత్ర చేపట్టనున్నట్లు.. ప్రజలు భారీ ఎత్తున పాల్గొనాలని ఆదివారమే ఆయన పిలుపునిచ్చారు. దీంతో ఉదయం నుంచే ఆయన నివాసంతో పాటు పార్టీ కార్యాలయం వద్ద భారీ ఎత్తున పోలీసులు బలగాల్ని మోహరించారు.  

నివాసం వద్ద పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను అఖిలేశ్‌ తన మద్దతుదారులతో కలిసి ధ్వంసం చేశారు. రోడ్డుపైకి వచ్చి పార్టీ కార్యాలయం వైపు వెళుతుండగా.. పోలీసులు మధ్యలోనే అడ్డుకొని వారిని నిలువరించే ప్రయత్నం చేశారు. దీంతో రోడ్డుపైనే బైఠాయించి నిరసన వ్యక్తం చేయడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. కొవిడ్‌-19 నిబంధనలు అమలులో ఉన్న నేపథ్యంలో ఎలాంటి నిరసన ప్రదర్శనలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. మరోవైపు దిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళన 12వ రోజుకు చేరుకుంది.

ఇవీ చదవండి..
బంద్‌కు భారీ మద్దతు

అంబానీ-అదానీ చట్టాల్ని రద్దు చేయాలి:రాహుల్‌


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని